మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. నిందితులకు ఉరిశిక్ష వేస్తామన్న సీఎం

Junior Doctor: పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని.. ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా.. కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై …

Read More »

ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ‘హాట్‌స్పాట్లు’గా ఆ 2 సిటీలు.. పెరగనున్న భూముల ధరలు!

Real Estate: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వేగంగా దూసుకెళ్తోంది. దేశాభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2050 నాటికి దేశంలోని 100 నగరాల్లో జనభా 10 లక్షలకుపైగా పెరగనుంది. ప్రస్తుతం 8 మెగా సిటీలకు ఇవి అదనం. పట్టాణాభివృద్ధికి ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, టూరిజం, ఆఫీస్ డైనమిక్స్ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రానున్న 5-6 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు, బలమైన వృద్ధి అవకాశాలను అంచనా వేస్తూ ప్రముఖ రియల్ …

Read More »

TSRTC: రాఖీ పండుగ వేళ ఆడపడుచులకు మరో బంపర్ ఆఫర్.. వారం ముందు నుంచే..!

తెలంగాణలోని మహిళామణులందరికీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా.. ఆడపడచులకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. ఆడపడుచుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. రక్షా బంధన్ సందర్భంగా.. ఆడపడుచులు తమ అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే కొందరు పుట్టింటికి, అన్నదమ్ములకు చాలా దూరంలో ఉండటమో.. అనివార్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోవటమో జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో.. ఆ అక్కాచెల్లెల్లు.. పోస్ట్ లేదా …

Read More »

తిరువూరు: ఏటీఎంలో రూ.5వేలు నొక్కితే రూ.7వేలు వచ్చాయి.. పండగ చేసుకున్నారుగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విచిత్రమైన ఘటన జరిగింది. పట్టణంలోని ఓ ఏటీఎంలో నుంచి నోట్ల వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.5వేలు డ్రా చేస్తే రూ.7వేలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికి తెలియడంతో.. కొందరు కస్టమర్లు ఏటీఎంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు అధికారులతో కలిసి ఏటీఎంను మూసివేయించారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత …

Read More »

మాధురిని పరిచయం చేసింది నా భార్యే.. ఏం తప్పుచేశానని నాకీ శిక్ష?.. దువ్వాడ

కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. విలేకర్ల సమావేశం నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ.. తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోశారని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనన్న దువ్వాడ శ్రీను.. వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని.. కుమార్తెలకు తనపై ద్వేషం నింపిందన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే.. తనకు కావాలని వాణి పట్టుబట్టిందన్నారు. విడాకులు …

Read More »

తిరుమలకు ఆగస్టు 14, 15 తర్వాత వెళ్తున్నారా.. మూడు రోజుల పాటూ రద్దు, టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. తిరుమల ఆలయంలో ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం …

Read More »

సీఎం రేవంత్ దక్షిణ కొరియా టూర్ రద్దు, 2 రోజుల ముందే ఇండియాకు.. క్లారిటీ ఇదే..!?

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 3వ తేదీన మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆగస్టు 14 వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా.. మొదట అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం లభించింది. మొదటి రోజు నుంచే రేవంత్ టీం.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. పెద్ద …

Read More »

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్.. ఆ రోజే చంద్రబాబు రివ్యూ.. ఆ డేట్ ఫిక్సా?

ఏపీలో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్ట్ 12వ తేదీన ఆర్టీసీ, రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి …

Read More »

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాది

Independence Day: దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఉగ్రవాది వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పంద్రాగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు ఉగ్రవాదులు తెరలేపగా.. వాటిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అయితే ఆ ఉగ్రవాది.. భారత ప్రభుత్వం వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. అతడి కోసం వెతుకుతుండగా.. తాజాగా ఢిల్లీలో ఆయుధాలతో పట్టుబడటం తీవ్ర …

Read More »

పుష్ప చూసి అందరూ గొడ్డళ్లు పట్టుకొని అడవికెళ్లిపోయారా?: హరీష్ శంకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమాపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోలు అడవిని కాపాడే సినిమాలు, పాత్రలు చేశారని.. ఇప్పుడు మాత్రం సినిమాల్లో హీరో అదే చెట్లను నరికేసి, స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పవన్ అన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి. పవన్ ఇండైరెక్ట్‌గా పుష్ప సినిమాకి, అల్లు అర్జున్‌కి కౌంటర్ ఇచ్చారంటూ వార్తలు రాసేశారు. ఇక దీనిపై బన్నీ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. నిన్నటి …

Read More »

గూగుల్ పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. రేపు ఆ బ్యాంక్ యూపీఐ సేవలు బంద్.. కారణమిదే!

UPI Downtime: ప్రస్తుతం మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు భారీగా పెరిగాయి. నిత్యం కోట్లాది ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. కిరాణ దుకాణం నుంచి పెద్ద పెద్ద అవసరాలకు సైతం యూపీఐ చేసే వెసులుబాటు ఉండడంతో గూగుల్ పే, ఫోన్, పే, పేటీఎం వంటి వాటి వినియోగం పెరిగింది. అయితే, బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తాజాగా దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సిస్టమ్ మెయింటనెన్స్ కారణంగా యూపీఐ …

Read More »

YSRCP: ఫ్యాన్ పార్టీకి షాకుల మీద షాకులు.. మరో కీలక నేత గుడ్ బై..

ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పిఠాపురంలో పెండెం దొరబాబు, అనంతపురంలో పైలా నర్సింహయ్య రాజీనామాలు చేసిన ఘటనలు మరువకముందే మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఇకపై దూరంగా …

Read More »

గుడ్‌మార్నింగ్‌ కాదు జై హింద్.. ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో మార్పు

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. పాఠశాలల్లో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని వాడాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 వ తేదీన దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్యానాలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో …

Read More »

హైదరాబాద్ RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఆ రూట్‌లో ప్రత్యేక సర్వీసులు

హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ (205 F) బస్సులను నేటి నుంచి నడపనున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్‌ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులురాకపోకలు సాగిస్తాయన్నారు. రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందన్నారు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ నుంచి ప్రతిరోజు …

Read More »

కేంద్రం స్కీమ్.. 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్.. రోజుకు రూ. 500, తర్వాత రూ. 15 వేల సాయం

PM Vishwakarma Scheme Benefits: దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్ తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాలు దాదాపు అన్ని వర్గాల వారి కోసం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా స్కీమ్స్ లాంఛ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరేలా వడ్డీలో రాయితీ కల్పిస్తూ రుణాలు మంజూరు …

Read More »