ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ‘హాట్‌స్పాట్లు’గా ఆ 2 సిటీలు.. పెరగనున్న భూముల ధరలు!

Real Estate: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వేగంగా దూసుకెళ్తోంది. దేశాభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2050 నాటికి దేశంలోని 100 నగరాల్లో జనభా 10 లక్షలకుపైగా పెరగనుంది. ప్రస్తుతం 8 మెగా సిటీలకు ఇవి అదనం. పట్టాణాభివృద్ధికి ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, టూరిజం, ఆఫీస్ డైనమిక్స్ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రానున్న 5-6 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు, బలమైన వృద్ధి అవకాశాలను అంచనా వేస్తూ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కొలియర్స్ (Colliers) ఓ నివేదిక తయారు చేసింది.

దేశంలోని 100 నగరాలు ఎమర్జింగ్ సిటీలుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక తెలిపింది. సమానమైన వృద్ధి, రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్స్‌గా ఉన్నట్లు తెలిపింది. ఈ 100 నగరాల్లో 30 నగరాల్లో అధిక వృద్ధి రేటు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా వీటిలో 17 నగరాలు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి తరగతుల్లో వేగవంతమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. ఈ జాబితాలో ఆంధ్రప్రేదశ్ నుంచి రెండు నగరాలు చోటు దక్కించుకున్నాయి. అవి తిరుపతి, వైజాగ్ ఉన్నాయి. 17 నగరాల లిస్ట్ ఓసారి చూద్దాం.

  • ఉత్తర భారత్ నుంచి అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లఖ్‌నవూ, వారణాసి ఉన్నాయి
  • తూర్పు భారత్ నుంచి పట్నా, పూరీలు ఉన్నాయి.
  • పశ్చిమ భారత్ నుంచి ద్వారకా, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్ ఉన్నాయి.
  • ఇక దక్షిణ భారత్ విషయానికి వస్తే కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇండోర్ ఉన్నాయి.

About amaravatinews

Check Also

పోసాని కృష్ణమురళికి మరో షాక్‌… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు కాజేశాడని టీడీపీ కార్యాలయంలో కంప్లైంట్‌

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *