ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుందని విద్యా హక్కు చట్టం చెబుతోంది. గతంలో ఉన్న విద్యా హక్కు చట్టంలోని.. నిబంధనల ప్రకారం కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత …

Read More »

‘50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్’.. సీఎం సంచలన ఆరోపణలు

బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని (Karnataka) కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందని ఆయన ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా అంగీకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. తన సొంత మైసూరులో బుధవారం పర్యటించిన సీఎం సిద్ధరామయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసి సభలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా …

Read More »

సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

సూర్య తన కంగువా సినిమాకు ఏ రేంజ్‌లో కష్టపడ్డాడు.. ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ వంటి సిటీల్లో పలు ఈవెంట్లు, ప్రెస్ మీట్లు పెట్టి ఇంటరాక్ట్ అయ్యాడు. సూర్య ఈ మూవీని తన భుజానికి ఎత్తుకుని అన్నీ తానై ముందుండి మరీ ప్రమోషన్స్ చేశాడు. మరి ఈ మూవీ నేడు (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ చాలా …

Read More »

రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ప్రకటించగా.. త్వరలో రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సీజన్‌ నుంచి అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా తయారు చేసినట్లు …

Read More »

అందులో తప్పేముంది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌‌లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా.. ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని …

Read More »

Nisha Madhulika: ఆమె వంటలకు కోట్లలో వీక్షకులు.. కాలక్షేపానికి మొదలెట్టి రిచెస్ట్ మహిళా యూట్యూబర్‌గా..!

Nisha Madhulika: అభిరుచి అవసరంతో పెనవేసుకున్నప్పుడు అది జీవితాలను మార్చే, వృత్తిని సృష్టించే ఒక ఆయుధంగా మారుతుంది. అది సామ్రాజ్యాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. వంటపై ఉన్న మక్కువ ఒక టీచర్‌ను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. కాలక్షేపం కోసం మొదలు పెట్టి ఇప్పుడు ఎందరికో శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది. 65 ఏళ్ల వయసులో అత్యంత ధనిక భారతీయ మహిళా యూట్యూబర్‌గా మార్చింది. ఆమెనే యూట్యూబ్‌లో సంచలనంగా మారిన నిషా మధులిక. ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. …

Read More »

విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు.. RBI షాకింగ్ ప్రకటన.. ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?

RBI: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట 1949 నిబంధనలు …

Read More »

అమరావతికి మహర్దశ.. కేంద్రం సమక్షంలో చర్చలు.. రూ.వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ (ADB) బ్యాంక్‌లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో.. ఆంధ్రప్రదేశ్ అధికారులు, సీఆర్డీఏ జరుపుతున్న చర్చలు సఫలం అయ్యాయి. ఈ చర్చల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయం చేయగా.. ఈ రుణానికి సంబంధించి ఎంవోయూ జరగలేదు. అయితే ఈ రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు విధించిన …

Read More »

చంద్రబాబుకు మరో గౌరవం.. దేశ రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా..

మన పెద్దోళ్లు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయని.. ఎందుకంటే ఏది ఎప్పుడు జరుగుతుందో, ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుందో.. ఏ జ్యోతిష్యుడు కూడా కచ్చితంగా చెప్పలేడు. ఇవాళ అట్టడుగున ఉన్నవారు.. రేపటికల్లా అందలం ఎక్కొచ్చు. కాకపోతే మనవైపు ఉండాల్సిందల్లా ప్రయత్నమే. ఆ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తుంటే.. మనకంటూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మనల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలౌతాయనే సామెత రాజకీయాలకు …

Read More »

కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట.. ఆ పనులు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 17న (ఆదివారం)న తిరుమలలో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పరువేట మండపానికి చేరుకుంటారు. శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో వనభోజన కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల …

Read More »

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి ఈ మూడు ప్రాంతాలు.. కీలక ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిని తిరిగి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజధాన పరిధిని మళ్లీ 8,352.69 చదరపు కిలో మీటర్లకు ప్రభుత్వం పెంచింది. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థల్లో గత ప్రభుత్వం విలీనం చేసిన ప్రాంతాన్ని తిరిగి సీఆర్డీఏలోకి కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని 92 గ్రామాల్లో 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సత్తెనపల్లి మున్సిపాలిటీ, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని 562.41 చదరపు కిలో మీటర్ల …

Read More »

Flight Tickets: ఎయిరిండియా ఫ్లాష్ సేల్.. రూ.1444కే విమాన ప్రయాణం.. ఒక్క రోజే ఛాన్స్!

Flight Tickets: విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్. తక్కువ ధరకే విమానంలో చక్కర్లు కొట్టవచ్చు. తరుచూ ప్రయాణం చేసే వారితో పాటు ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావించే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇందుకోసం దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక సేల్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1444కే విమానం ఎక్కడమే కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు …

Read More »

RGUKT: ‘నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి’.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్..!

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని స్వాతిప్రియ ప్రాణాలు కోల్పోయింది. స్వాతిప్రియ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పురపాలిక పరిధిలోని పెర్కిట్‌ గ్రామం. ఉజ్వల-రవీందర్‌ దంపతులకు స్వాతిప్రియ(18) రెండో సంతానం. సోమవారం ఉదయం తోటి స్నేహితులు టిఫిన్‌ చేయడానికి పిలవగా ఆమె రానని చెప్పింది. ఆ తర్వాత అర గంటకు గదిలో ఫ్యాన్‌కు …

Read More »

TATA Group: ఏపీకి టాటా గ్రూప్ బంపరాఫర్.. టీసీఎస్‌ మాత్రమే కాదు అంతకు మించి..!

Tata Companies Chairman Chandrasekaran meets CM Nara Chandrababu naidu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌, ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, …

Read More »