బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మీ ఖాతా అడ్రస్ మార్చారా? చూసుకోండి మరి

Banking: బ్యాంక్ అకౌంట్ తీసుకున్ని సంవత్సరాలు గడుస్తుంటుంది. కొందరికి ఒకటికి మించి అకౌంట్లు ఉంటాయి. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా చిరునామా మారినప్పటికీ బ్యాంక్ ఖాతాలో మాత్రం పాత అడ్రస్ కొనసాగిస్తుంటారు. ఇలా చేయడం పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. మీరు చిరునామా మారినప్పుడల్లా బ్యాంక్ అకౌంట్‌లోనూ వివరాలను అప్డేట్ చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంక్ అకౌంట్ కీలకమైనది. ఇందులో మన అడ్రస్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలనూ ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. …

Read More »

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అద్భుత అవకాశం.. వెంటనే దరఖాస్తు చేస్కోండి, 25 వరకే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ టీచర్లకు ముఖ్యమైన గమనిక. ఎస్‌సీఈఆర్టీ (రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి)లో డిప్యుటేషన్‌పై పనిచేసే పోస్టులకు దరఖాస్తు చేసేందుకు పురపాలక ఉపాధ్యాయులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ పోస్టులకు సంబంధించి.. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని వారికే మొదట అవకాశం కల్పించారు. ఇటు పురపాలక టీచర్లకూ డిప్యుటేషన్‌ ఇవ్వాలని విన్నవించడంతో.. ఈ మేరకు వారికి కూడా అనుమతి ఇచ్చారు. విద్యా శాఖ ఎస్‌సీఈఆర్టీలో 34 పోస్టులను డిప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. …

Read More »

విశాఖలో ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా.. పోలీసులు డోర్ తీయగానే, అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయారు

విశాఖపట్నంలో సరికొత్త దందా బయటపడింది. నగరంలో కాస్మొటిక్స్‌ అమ్మకాల ముసుగులో ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఓ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ఈ తతంగం మొత్తం నడుస్తుండగా.. విశాఖ సైబర్‌ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ గ్యాంగ్ చైనా కేంద్రంగా నడిచే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు చెబుతున్న వివరాల ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంకు చెందిన సూర్యమోహన్‌ హాంకాంగ్, తైవాన్‌‌కు వెళ్లొచ్చారు. అనంతరం నగరానికి చెందిన సాయిరామ్, గిరిష్‌లతో …

Read More »

ఏపీలో మరో రెండు పథకాల అమలుకు మహూర్తం ఫిక్స్.. ఒక్కో విద్యార్థికి . 15వేలు, ఒక్కో రైతుకు రూ.20వేలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టింది. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయాలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది. తల్లికి వందనం పథకాన్ని మరో మూడు నెలల్లో అమలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే రైతులకు సంబంధించిన ‘అన్నదాతా సుఖీభవ’ …

Read More »

గుంటూరు: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు

గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు …

Read More »

AP: ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్.. పూజారి పనే

ఆంధ్రప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దారుణం వెనుక పూజారి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజారి హరినాథ్ మరో ఐదుగురితో కలిసి పేలుడు పదార్థాలతో గుడిని పేల్చివేసేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం (అక్టోబర్ 14) రాత్రి ధ్వంసం చేశారు. పేలుడు పదార్థాలతో ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వర్షం కురవడంతో పేలుడు పదార్థాలు సరిగా …

Read More »

నేను ఆ మాట చెబితే పార్టీలో ఎవరికీ నచ్చకపోవచ్చు.. నా వల్ల మాత్రం కాదు: జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలు అనేంత దారుణమైన పాలనను చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందన్నారు. సూపర్‌-6 పథకాలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే బడ్జెట్ పెట్టకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఓటాన్ అకౌంట్‌తో నడిపిస్తున్నారని.. చంద్రబాబు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సదస్సులో …

Read More »

విశాఖ: మద్యం అమ్మేందుకు షాపు దొరకలేదు.. అందుకే ఇలా, ఐడియా అదిరిపోయింది

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి.. బుధవారం నుంచి అమ్మకాలు మొదలుపెట్టారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా.. లాటరీలో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్నవారిని కొత్త సమస్య వెంటాడుతోంది. శుభమా అని కొత్త షాపు ఓపెన్ చేద్దామంటే అద్దెకు గదులు దొరకడం లేదు.. రాష్ట్రంలో చాలామందికి ఇదే సమస్య ఎదురవుతోంది. షాపుల దొరక్క ఇబ్బందులుపడుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో షాపులు దొరికినా అద్దెలు భారీగా ఉండటంతో భయపడుతున్నారు. ఒక్కరోజు మద్యం విక్రయాలు ఆగిపోయినా నష్టాలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తాత్కాలికంగా వసతి ఏర్పాటు …

Read More »

వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 18, 2024): మేష రాశి వారు ఈ రోజు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో …

Read More »

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. హమ్మయ్యా ఆ సమస్యకు చెక్!

తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించడంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. కొండపై అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీసుబ్బరాయుడు.. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక …

Read More »

మందుబాబులకు శుభవార్త.. అక్కడ మద్యం ధరలపై భారీ తగ్గింపు

ఏపీలో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. బుధవారం, గురువారం అమ్మకాలు ఊపందుకున్నాయి.. అన్ని బ్రాండ్ మద్యం అందుబాటులోకి రావడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. కొత్త మద్యం పాలసీ రావడంతో బార్ల నిర్వాహకులు దెబ్బకు దిగొచ్చారు.. మద్యం ధరలు తగ్గించారు. మొన్నటి వరకు బార్లలో రెండింతలకు మద్యాన్ని రెండింతల ధరలకు విక్రయించేవారనే విమర్శలు ఉన్నాయి. బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో.. మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బార్ల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. …

Read More »

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ ఛాన్స్ మాత్రం ఉంది!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్లతో పాటుగా కొంతమంది ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్నవారిపై కూడా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు తేలడంతో.. వాటిని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టంవచ్చినట్లుగా అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్నివేలమంది అనర్హులు.. సదరం సర్టిఫికేట్ ద్వారా పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని పింఛన్లను మరోసారి తనిఖీ చేయాలని అధికారులకు …

Read More »

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం.. బీజేపీ సీఎంలను పక్కన పెట్టి మరీ..!

Chandrababu: హర్యానాలో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార మహోత్సవం.. చండీగఢ్‌లోని పంచకుల పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు 18 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలో కింగ్ మేకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. …

Read More »

Auto Stocks: కుప్పకూలిన స్టాక్.. ఒక్కరోజే షేరుపై రూ. 1500 కుపైగా పతనం.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం!

Auto Stocks Fall: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు.. పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో గత కొన్ని సెషన్లుగా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ ఆరంభంలో కాస్త మెరుగ్గానే ఉన్న సూచీలు.. ఆఖర్లో భారీగా పడిపోయాయి. చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పడిపోయి 81 వేల మార్కు వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ …

Read More »

దెబ్బ తీసిన BSNL.. కోటి మంది యూజర్లను కోల్పోయిన JIO.. బెడిసికొట్టిన ప్లాన్!

Jio Lose: దేశీయ టెలికాం రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియోకు ఊహించని దెబ్బ తగిలింది. నెట్‌వర్క్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో యూజర్లు పెరుగుతూ రావడమే కానీ, తగ్గిన దాఖలాలు లేవు. అయితే ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం ఊహించని విధంగా యూజర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత మూడు నెలల్లో కోటి మందికిపైగా సబ్‌స్క్రైబర్లు జియోను వీడారు. అయితే, రీఛార్జ్ ప్లాన్లు పెంచినప్పుడు కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం సర్వసాధారణమేనని, తమ సంస్థకు వచ్చిన పెద్ద ఇబ్బంది లేదని …

Read More »