తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు కీలక పదవి.. ఈసారి జాతీయ స్థాయిలో.. ఉత్తర్వులు జారీ..!

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది ఆ పార్టీ అధిష్ఠానం. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌కు కీలక అవకాశం కల్పించిన అధిష్ఠాటం.. ఇప్పుడు బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న క్రమంలో.. పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టింది. అయితే.. ఇందులో తెలంగాణ నుంచి సీనియర్ నేత అయిన ఎంపీ కె. లక్ష్మణ్‌ను బీజేపీ జాతీయ …

Read More »

ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే పోటీ చేయను.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గత కొంతకాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తున్నాయని.. అలాగే మన దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. ఇక హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ …

Read More »

Assembly Elections 2024 Date: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

Assembly Elections 2024 Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ – అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలకు …

Read More »

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అడవికి ముప్పు నిజమేనా..?

Vikarabad Navy Radar Station: తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. అడవికి ముప్పు వాటిల్లుతుందని.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ కొంత మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న …

Read More »

టాటా గ్రూప్ కీలక ప్రకటన.. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఈ రంగాలకే ఫుల్ డిమాండ్!

Tata Group Manufacturing Jobs: దేశంలో అన్నింటికంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థ టాటా గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లలోనే ఇది వేగంగా పలు రంగాల వ్యాపారాలకు విస్తరించి.. మార్కెట్ విలువను ఊహించని రీతిలో పెంచుకుంది. టాటా గ్రూప్ కింద పదుల కొద్ది కంపెనీలు ఉన్నాయి. దాదాపు 20 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి టీసీఎస్, టాటా ఎల్‌క్సీ, టాటా క్లాస్ ఎడ్జ్, ఫుడ్ అండ్ బేవరేజెస్‌కు సంబంధించి టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, …

Read More »

లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం పంపిన పేర్లు ఇవే.. డీజీపీ వెల్లడి

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీనిపై దర్యా్ప్తు జరగాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర …

Read More »

ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఈజీగా ITR ఫైలింగ్.. ఐటీ శాఖ కీలక ప్రకటన!

E-Filing Portal: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రతి ఏటా జులై 31వ తేదీలోపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ప్రతి సంవత్సరం ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు, మరింత సులభంగా ఐటీఆర్ ఫైలింగ్ చేసేలా వీలు కల్పించేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమైంది. యూజర్ ఫ్రెండ్లీ ఇ-ఫైలింగ్ పోర్టల్ తీసుకురానుంది. ట్యాక్స్ పేయర్లకు అనుకూలంగా ఉండేలా కీలక మార్పులు చేస్తూ ఇ-ఫైలింగ్ పోర్టల్ తెస్తోంది. …

Read More »

ఏపీలో జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రుల నియామకం.. ఆ ఇద్దరికి బాధ్యతలు ఇవ్వలేదు, చంద్రబాబు జిల్లాకు ఎవరంటే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. 26 జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రుల్ని నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల్ని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా – కొండపల్లి శ్రీనివాస్అల్లూరి సీతారామరాజు జిల్లా – గుమ్మడి సంధ్యారాణిపార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడువిజయనగరం జిల్లా – వంగలపూడి అనితవిశాఖపట్నం జిల్లా – డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిఅనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్రకాకినాడ జిల్లా – పొంగూరు నారాయణతూర్పుగోదావరి, …

Read More »

ఏపీలో మహిళలకు శుభవార్త.. దీపావళికి మరో పథకం అమలు, అందరికీ ఉచితంగానే!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో చాలారోజులుగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు …

Read More »

విజయవాడ, విశాఖవాసులకు అదిరిపోయే న్యూస్.. గంట జర్నీ మాత్రమే, కొత్త విమాన సర్వీసులు

విజయవడ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరుగ ప్రయాణంలో విమానం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ విషయానికి వస్తే.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల …

Read More »

నెల్లూరు: ఈ మహిళ ఎంతో లక్కీ.. బంగారం మొత్తం, ఆర్టీసీ బస్సులో ఆసక్తికర ఘటన

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును జాగ్రత్తగా తిరిగి అప్పగించారు. ఆదివారం రోజు అల్లూరులో శ్రీహరికోట కుమారి ఆర్టీసీ బస్సు ఎక్కారు.. అయితే తన స్టాప్‌లో బస్సు దిగిపోయే సమయంలో ఆమె తన పర్సును సీట్‌లో మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆర్టీసీ బస్ కండక్టర్ వెంకయ్య పర్సును గమనించారు.. తీసి చూడగానే బంగారం, డబ్బులు కనిపించాయి. వెంటనే ఈ సమాచారాన్ని డిపో మేనేజర్‌కు అందించారు. ఆ మహిళ పర్సును తీసుకెళ్లి జాగ్రత్తగా డిపోలో …

Read More »

ఏపీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీపికబురు.. వారంలో డబ్బులొచ్చాయి, చంద్రబాబు రిక్వెస్ట్‌తో!

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం శుభవార్త చెప్పింది.. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 200.06 కి.మీ. పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్‌ (కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి) నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ స్వయంగా వెల్లడించారు. అలాగే గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో గుంటూరు శంకర్‌ విలాస్‌ ఆర్వోబీని నాలుగు వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు కూడా ట్వీట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా …

Read More »

ఏపీలో యువతకు బంపరాఫర్.. టెన్త్ పాసైనా, ఫెయిలైనా ఫుడ్ పెట్టి ఉచితంగా.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్‌ బైర్డ్‌ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. యువకుల కోసం ఎయిర్‌ కండిషనర్‌, కూలర్‌, రిఫ్రిజిరేటర్‌ మెకానిజమ్‌పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని రాజీవ్‌నగర్‌లోని భారత వికాస్‌ పరిషత్‌ భవనంలో అతి త్వరలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. పదో …

Read More »

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. నేడే షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఇందు కోసం మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోకసభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు తేదీలను ప్రకటిస్తారని భావించారు. కానీ, …

Read More »

వారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 15, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వాహన యోగానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొందరు బంధుమిత్రుల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు. …

Read More »