Tirumala Declaration: తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు వారికి కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ప్రసాదంపై చెలరేగిన వివాదం ఏపీతో పాటు తెలంగాణలో కూడా అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లడ్డూ వివాదంపై తాజాగా.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పందించారు. మంగళవారం (అక్టోబర్ 01న) రోజున ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. తిరుమలకు వెళ్తానని చెప్పి.. పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం
తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Temple)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 7 దరఖాస్తులకు చివరితేది. ఇతర ముఖ్యమైన సమాచారం : మిడిల్ లెవల్ …
Read More »దసరాకు ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్
తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలవుతోంది.. ఈ నెల 2 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు మొదలుకాబోతున్నాయి. అయితే దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు సొంతూళ్లకు వచ్చి వెళ్లే వారి కోసం అదనంగా 6,100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్ల కోసం.. రాష్ట్రంలో ఓ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని …
Read More »కర్ణాటక సీఎంపై ఈడీ కేసు.. సిద్ధరామయ్య భార్య సంచలన నిర్ణయం
ముడా భూముల (MUDA Scam) వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బీఎన్ పార్వతి (BN Parvathi) కీలక ప్రకటన చేశారు. తమకు ముడా పరిధిలో కేటాయించిన స్థలాలను తిరిగి అప్పగించేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి వెల్లడించారు. అంతేకాదు, ముడా భూముల వ్యవహారంలో వస్తోన్న అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని …
Read More »ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేస్తాం.. చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 4 (శుక్రవారం) నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని.. వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదు అన్నారు. వరద సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు.. ప్రభుత్వం డబ్బులు …
Read More »ఏపీలో వాళ్ల అకౌంట్‌లలోకి రూ.10వేలు.. జగన్ సర్కార్ పథకం కొనసాగింపు..పేరు మార్పు, కొత్త పేరిదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పలు పథకాలకు పేర్లు మార్చారు. తాజాగా మరో పథకానికి ప్రభుత్వం పేరు మార్చింది. గత ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »ఐఐటీ, నీట్‌లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చదివి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కార్పొరేట్ సెక్టార్‌లో ఐదంకెల జీతం.. హైఫై లైఫ్.. వారంలో రెండ్రోజులు హాలీడే, విదేశీ ట్రిప్పులు ఇలా చాలా సౌకర్యాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉంటాయి. దీంతో చాలా మంది యువత బీటెక్‌లు చదివి సాఫ్ట్‌వేర్ రంగం వైపు మెుగ్గుచూపుతారు. గత పదేళ్లుగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాఫ్ట్‌వేర్ రంగంపై వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారుతోంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే.. సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత …
Read More »ఆధునిక హంగులతో కొత్త ఎన్‌సీఏ.. బెంగళూరులో ప్రారంభించిన బీసీసీఐ
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. బెంగళూరులో తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. అయితే ఈ కొత్త ఎన్‌సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ)గా పేరుపెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా పలువురు ఇతర ఆటగాళ్లతో కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటివరకు జాతీయ క్రికెట్ అకాడమీని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించేవారు. కానీ తాజాగా కెంపెగౌడ విమానాశ్రయానికి …
Read More »హెచ్‌సీఎల్ ఆఫీసు వాష్‌రూమ్‌లో గుండెపోటుతో టెకీ మృతి
కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా అనే మహిళ బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అలాగే, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో ఛార్టెట్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ అధిక పని భారంతో మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా, ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన కార్యాలయం వాష్‌రూమ్‌లోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని హెచ్‌సీఎల్ …
Read More »భారీగా పెరిగి ఒక్కసారిగా పతనమైన అంబానీ స్టాక్స్.. మళ్లీ లోయర్ సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు నష్టం!
Anil Ambani’s Reliance Shares: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. దిగ్గజ కంపెనీ స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ.. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ADAG) షేర్లు పడిపోతున్నాయి. ఇటీవల అప్పుల్ని తీర్చేయడం సహా నిధుల సమీకరణ వంటి ఇతర ప్రణాళికల నేపథ్యంలో.. గ్రూప్ స్టాక్స్ అన్నీ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. రిలయన్స్ పవర్ స్టాక్ ప్రతి రోజూ అప్పర్ సర్క్యూట్ …
Read More »పైకి చూస్తే పాన్ షాపు.. రోజూ జనాలతో రద్దీ, అనుమానంతో వెళ్లి చూస్తే!
విశాఖపట్నంలో గంజాయి చాక్లెట్లు కలకలంరేపాయి.. ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. చాక్లెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి అమ్మేస్తోంది.. ఓ పాన్‌లో షాపులో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంలోని క్రాంతిథియేటర్ ఎదురుగా మనోజ్‌కుమార్‌చౌదరి పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అతడి షాపులో గంజాయితో తయారుచేసిన చాక్లెట్లను రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కగా సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ పాన్ షాపులో దాడులు చేయగా.. అమ్మకానికి సిద్ధంగా ఉంచి 133 గంజాయి చాకెట్లు (660 గ్రాములు) దొరికాయి.చాకెట్లను …
Read More »కాలు దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్లాడు.. పాపం ప్రాణాలే పోయాయి, డేంజర్ బ్యాక్టీరియా
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో పలు ప్రాంతాలు మునిగిపోయాయి. విజయవాడతో పాటుగా గుంటూరులోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. అయితే జగ్గయ్యపేటలో ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఓ బాలుడు కాలును కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 81 ఏళ్ల వృద్ధుడు ఏకంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు నెహ్రూనగర్ ఆరో వీధిలో నివాసం ఉంటున్న నారాయణకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.. ముగ్గురికి వివాహాలు అయ్యాయి. నారాయణ …
Read More »ఈ టీచర్ మహా ముదురు.. ఏకంగా రూ.6.70కోట్లు, మనోడి గురించి తెలిస్తే!
ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది.. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ తోటి ఉద్యోగుల్ని, జనాల్ని నిండా ముంచేశారు. ఉన్నట్టుండి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.. తీరా ఆరా తీస్తే ఆయన చేతిలో మోసపోయినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేస్తవారపేటకు చెందిన కిషోర్‌కుమార్.. కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ప్రభుత్వ ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్నారు. ఆయన తోటి ఉపాధ్యాయులు, స్థానికులు, వ్యాపారుల్ని.. చీటిపాటలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశారు. కిషోర్ కుమార్ మెడికల్ …
Read More »ఈ ఫ్రూట్ ధర కేజీ రూ.500.. భారీ లాభాలు, యువ రైతు సక్సెస్ స్టోరీ
ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన యువ రైతు పోషకాల పండు సాగుతో భారీ లాభాలు అందుకుంటున్నారు. ముందు ఒక మొక్కను తెచ్చి నాటి చూశారు.. ఆ తర్వాత ఆ పండు విలువ తెలిసి సాగు ప్రారంభించారు. మంచి సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ పండు చూడటానికి నారింజ రంగు.. ఆగాకర వంటి ఆకారంలో కనిపిస్తుంది. ఈ కాయను కోసి చూస్తే.. పసుపు రంగు గుజ్జు మధ్య ఎర్రటి రసంలో గింజలు ఉంటాయి. ఆ పండు పేరు గ్యాక్ (గ్రేట్ అమెరికన్ కంట్రీ) …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్ రీజినల్ కౌన్సిల్ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఈ అంశంపై …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal