Blog Layout

మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. గత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ దళ విజయానికి అసలు కారణం ఇదే!

26 ఏళ్ల తరువాత ఢిల్లీకి రాజా అనిపించుకుంది భారతీయ జనతా పార్టీ. దేశ రాజధానిలో ఊరిస్తున్న విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు కమలనాథులు. కొన్ని నెలల ముందే గ్రౌండ్ వర్క్‌ మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. విజయమే లక్ష్యంగా ఢిల్లీ గల్లీల్లో దూసుకుపోయారు.మూడు పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా… దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ …

Read More »

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ సంచలనం.. ఆప్ అధినేత కేజ్రివాల్ ఓటమి

ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌‌పై 1200 పైచిలుకు ఓట్ల తేడాతో  బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్‌ చేతిలో మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో పార్టీ కీలక నేత..  సత్యేందర్ జైన్ సైతం.. షాకుర్‌ బస్తీ స్థానంలో ఓడిపోయారు.  ఓటమివైపు సాగుతోన్న పార్టీకి అగ్ర …

Read More »

నీట్‌ యూజీ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతేడాది నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే..దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్‌-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్నట్లు నేషనల్‌ …

Read More »

కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌కి కేబినెట్‌లో ఫుల్ టీమ్‌ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సంవ‌త్సర కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వ‌స్తున్న …

Read More »

ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. సాకారం కాబోతున్న ఏళ్ల నాటి కల..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.. రాష్ట్ర విభజన టైమ్‌లో ఇచ్చిన హామీని నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.. దీంతో ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌కు శుక్రవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్‌ ను ఏర్పాటు …

Read More »

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక ధృవీకరణ పత్రాల అవసరం లేకుండా, వారి స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు పొందే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు. డేటా …

Read More »

తెలంగాణ టెట్‌లో 83,711 మంది ఉత్తీర్ణత.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు పేపర్లకు కలిపి మొత్తం 83,711 మంది అభ్యర్ధులు త్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 31.21 శాతం మంది మాత్రమే టెట్‌లో ఉత్తీర్ణత పొందారన్నమాట. నిజానికి టెట్ డిసెంబర్‌ 2024 సెషన్‌ పరీక్షకు 2,05,278 మంది పరీక్ష రాశారు..తెలంగాణ రాష్ట్రంలో టెట్‌-2024 రెండో విడత పరీక్షలు గత నెలలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించగా తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి. రెండు పేపర్లు కలిపి 83,711 మంది ఉత్తీర్ణత …

Read More »

వైసీపీ అధినేత జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్‌ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత …

Read More »

ఇంటర్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. వాట్సప్‌లో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు శుక్రవారం (ఫిబ్రవరి 7) ఇంటర్‌ హాల్‌టికెట్లను విడుదల చేసింది. అయితే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఈసారి వాట్సప్‌ గవర్నెన్స్‌లో కూడా ఇంటర్‌ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ …

Read More »