Blog Layout

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. తమిళనాడు గ్రామంలో సంబరాలు, ఎందుకో తెలుసా?

Kamala Harris: నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో ఉండగా.. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 3, 4 రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో కమలా హరిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుండటంతో.. ఎవరు గెలుస్తారనేది అన్ని దేశాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. …

Read More »

Chardham Yatra: గంగోత్రి, యుమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత.. మళ్లీ 6 నెలల తర్వాతే చార్‌ధామ్ యాత్ర

Chardham Yatra: ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు ఆలయాలను 6 నెలల పాటు మూసి వేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. …

Read More »

వైసీపీ మాజీ ఎంపీ మాధవ్‌‌ అసభ్యకరంగా.. పోక్సో కింద కేసు పెట్టాలని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్‌ బయటకు చెబుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును ఫిర్యాదులో కోరారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమన్నారు. అందుకే మాధవ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు. ఏదైనా ఒక ఘటన జరిగిన సమయంలో అత్యాచారాలకు గురైన వారి వివరాలు …

Read More »

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నగరంలో మరో స్కైవాక్, ఈ ఏరియాలోనే

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌళిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్త అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో భారీగా ఫ్లైఓవర్లు, …

Read More »

APY Scheme: కేంద్రం పథకం.. ఉద్యోగం లేకపోయినా ప్రతి నెలా రూ. 5 వేల పెన్షన్.. నెలకు రూ. 210 కడితే చాలు..!

Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. వీరికి కూడా 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ అందుతుంది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 3 సామాజిక భద్రతా పథకాల్ని తీసుకురాగా.. అందులోనే ఒకటి అటల్ పెన్షన్ స్కీమ్. ఇందులో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ పోతే.. రిటైర్మెంట్ తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా ఎంత పెన్షన్ …

Read More »

కురుమూర్తి జాత‌ర‌కు వెళ్తున్నారా..? TGSRTC తీపి కబురు

పాలమూరు జిల్లాలోని సప్త కొండలు నెలరోజుల పాటు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. జిల్లా ప్రజల ఇలవేల్పు దైవం కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడు కొండల మధ్య లక్ష్మి సమేతంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో స్వయంభవుగా వెలిసిన స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, …

Read More »

ఏపీలో వారందరికి బిగ్ అలర్ట్.. ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తారు, మరో రూ.2లక్షలు కూడా.. వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతి వృత్తిదారులకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తిస్తుంది. 2023-24 ఆగస్టు వరకు దరఖాస్తులు స్వీకరించి అర్హుల్ని గుర్తించారు. రెండో విడత జాబితాలో దరఖాస్తులకు సంబంధించి సర్వే చేయాల్సి ఉంది. కొన్ని అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. ఈ మేరకు , సచివాలయ సంక్షేమ కార్యదర్శులు, నోడల్‌ అధికారులు, మెప్మా కమ్యూనిటీ అర్గనైజర్ల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ …

Read More »

ఏపీలో యువతకు శుభవార్త.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతం.. ఉచిత భోజనం, వసతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేషనల్‌ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) దీనిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు 1.10 కోట్ల మంది ఉండటంతో.. వారికి ఒకేషనల్‌ రంగంలో ఉపాధి కల్పించే పనిలో ఉంది.. ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ చేపట్టింది. వీరికి ప్రారంభ వేతనం కొంత తక్కువగా ఉండటంతో.. ఈ అవకాశాలను పట్టించుకోవడం లేదు. దీంతో నిపుణుల కొరత …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్.. ఆ జిల్లాలోనే ఏర్పాటు, మంత్రి సొంత నియోజకర్గం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. బాపట్ల జిల్లా అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అద్దంకి ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరను కూడా రెవెన్యూ …

Read More »

ఏపీలో వారందరికి తీపికబురు.. ఉచితంగానే, ఒక్కొక్కరికి రూ.9వేలు ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. ఏడాదిలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఏడాది 12 వేల మందికి శిక్షణ అందించనుంది. ఉన్నతి కార్యక్రమంలో భాగంగా.. మూడు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.9 వేల చొప్పున …

Read More »