Blog Layout

చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్‌ కన్సెంట్‌ (సాధారణ సమ్మతి) ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే.. ఏపీ భూభాగంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకునేందుకు, అమలు చేసేందుకు వీలు ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. …

Read More »

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు, వివరాలివే..

హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహణ పనుల కారణంగా ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన ట్రైన్ల వివరాలను వెల్లడించారు. వరంగల్‌- హైదరాబాద్‌ మెమూ, కాజీపేట- బల్లార్ష, సికింద్రాబాద్‌- వరంగల్ ట్రైన్లు సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు మెుత్తం …

Read More »

అర్హులైనా రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్షలోపు, జులై 31న రెండో విడతలో రూ. లక్షన్నర లోపు.. ఆగస్టు 31న మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ …

Read More »

ఆ ఒక్క కారణంతోనే భారీగా దిగొస్తున్న ఇంధన ధరలు.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

Easing Mideast Tensions: కొద్దిరోజుల కిందట అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాలు, ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, అమెరికా చైనా ట్రేడ్ వార్, బంగ్లాదేశ్‌లో సంక్షోభం.. ఇలా ఎన్నో కారణాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపాయి. ఈ కారణంతోనే కొన్నాళ్లు బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటం.. ఇంధన ధరలు పెరగడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు కొన్ని కారణాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు పతనం అవుతున్నాయి. మంగళవారం రోజు కూడా పడిపోగా.. ఇప్పుడు 2 …

Read More »

టీటీడీ ఛైర్మన్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి.. ఏపీ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ వైరల్, 25మందికి పదవులు!

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురికి నామినేటెడ్ పోస్టులు ఖాయం అయ్యాయంటూ ఓ జాబితా వైరల్ అవుతోంది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం …

Read More »

జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం.. ఆ చిన్నారికి ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్, నర్సుకు కూడా..!

రాఖీ పౌర్ణమి రోజున గ‌ద్వాల డిపోన‌కు చెందిన ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ చిన్నారి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. …

Read More »

గంటకు రూ. 4 వేలు.. రోజుకు 28 వేల జీతం.. బంపరాఫర్.. ఏం పని చేయాలి.. అర్హతలేంటి?

Elon Musk Optimus: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈయన సంపద బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ సంపద 201 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎప్పుడూ చిత్రవిచిత్ర ప్రకటనలు చేసే ఎలాన్ మస్క్.. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు మస్క్ నేతృత్వంలోని దిగ్గజ ఎలక్ట్రిక్ …

Read More »

ఉక్రెయిన్‌లో మోదీ టూర్.. లగ్జరీ ట్రైన్‌లో ప్రయాణం.. ట్రైన్ ఫోర్స్ వన్ విశేషాలేంటంటే?

Train Force One: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు …

Read More »

30 ఏళ్ల తర్వాత కూడా అదే రియాక్షన్.. రియల్ ‘చంద్రముఖి’లో ఈ సీన్ చూశారా?

టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే మలయాళంలో కూడా ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆల్ టైమ్ హిట్ మూవీ ‘మణిచిత్రతాళు’ (చంద్రముఖి ఒరిజినల్)ను థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసిన ఆడియన్స్ వారి రియాక్షన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులోని ఓ సీను …

Read More »

రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరిపైనే పోటీ?

వినేశ్ ఫొగాట్. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 లో మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా పతకానికి దూరమైన వినేశ్ ఫొగాట్‌ పట్ల దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని.. నెటిజన్ల వరకు అంతా వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో చేతివరకు వచ్చిన పతకం చేజారిపోయింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్న వినేశ్ ఫొగాట్.. రెజ్లింగ్‌ నుంచి …

Read More »