అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు …
Read More »Blog Layout
యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్
రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కీ ప్రకటించారు. అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన …
Read More »అదరగొట్టిన ఐపీఓలు.. తొలిరోజే 140 శాతం పెరిగిన షేరు.. ఒక్క లాట్‌పై ఏకంగా రూ. 21 వేల లాభం
మార్కెట్ల లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని ఐపీఓలు మంచి లాభాల్ని అందిస్తుంటాయి. లిస్టింగ్‌తోనే భారీగా పెరుగుతుంటాయి. ఇటీవల మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టాక్ ఫ్లాట్ లిస్టింగ్ అయినప్పటికీ.. తర్వాత వరుసగా 3 సెషన్లు 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 79 వేల 500 …
Read More »శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం, భక్తుల్లో భయం
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి దగ్గర చిరుత కనిపించింది. అక్కడ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చింది.. ఆ పక్కనే ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు మొత్తం ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అలాగే ఈ తెల్లవారుజామున మరికొన్ని ఇళ్ల దగ్గర చిరుతపులి సంచారం కనిపించింది. జనాల నివాసాల దగ్గర చిరుత సంచారంపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై …
Read More »అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా దిగొస్తున్న ఆహార ధరలు.. ఐదేళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం
Food Inflation: జులై నెలలో భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (రిటైల్ ఇన్‌ఫ్లేషన్) అయిదేళ్ల కనిష్టమైన 3.54 శాతానికి దిగొచ్చింది. ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువ నమోదైంది. ఇలా రావడం గత 5 సంవత్సరాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ (హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం జూన్ నెలలో 5.08 శాతం కాగా.. 2023 జులైలో 7.44 శాతంగా ఉంది. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం …
Read More »చంద్రబాబు నిర్ణయంతో బొత్స సత్యనారాయణకు జాక్‌పాట్.. అనుకున్నదే అయ్యిందిగా!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటూ కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా …
Read More »విజయవాడలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ కృష్ణమ్మకు హారతి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న సమయంలోని కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయాయి.. అయితే వాటిని తిరిగి ప్రారంభిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెర్రీ దగ్గర మళ్లీ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని నెల రోజుల్లోగా తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు …
Read More »విజయవాడ దుర్గమ్మ హుండీకి కాసుల వర్షం.. 18 రోజుల్లో రూ.కోట్లలో ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు దుర్గామల్లేశ్వర దేవస్థానంలో హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయంలోని మహామండపం 6వ అంతస్తులో ఈవో ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 18 రోజులకుగాను అమ్మవారికి కానుకల రూపంలో రూ.2,97,47,668 నగదు సమకూరింది. అంటే రోజుకు సగటున రూ.16,62,648 చొప్పున నగదు రూపంలో కానుకలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 410 గ్రాములు, వెండి 5 కిలోల 280 గ్రాములు భక్తులు హుండీల ద్వారా అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మ హుండీలలో విదేశీ కరెన్సీ కూడా …
Read More »అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ …
Read More »హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal