amaravatinews
August 16, 2024 Business, జాతీయం, బిజినెస్
129
Reliance Power Shares: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి చాలానే స్టాక్స్ ఉన్నాయి. అయితే ఇవి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. తర్వాత అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో దాదాపు చాలా కంపెనీలు దివాలా స్థాయికి కూడా పడిపోయాయి. బ్యాంకులకు అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తన దగ్గర సంపదేం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. దీంతో ఆయా స్టాక్స్ పడిపోయాయి. కానీ కొంతకాలంగా పరిస్థితి మారిపోతోంది. ఆయన కంపెనీలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. వ్యాపారాలు మెరుగుపడుతున్నాయి. అంబానీ …
Read More »
amaravatinews
August 16, 2024 జాతీయం
127
మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు …
Read More »
amaravatinews
August 16, 2024 ఆంధ్రప్రదేశ్, పల్నాడు
155
ఏడేళ్ల బాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా స్కూల్‌కు వెళుతూ అరుదైన ఘనతను దక్కించుకుంది.. సరికొత్త రికార్డుల్ని అందుకుంది. ఐదున్నర నెలలకే పుట్టి.. మూడున్నరేళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలి కారు డ్రైవర్ కాగా.. కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. షీబా 2017లో గర్భం దాల్చిన ఐదో నెలలోనే అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అనే పాపకు జన్మనిచ్చారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చలేదు. …
Read More »
amaravatinews
August 16, 2024 ఆంధ్రప్రదేశ్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
143
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-8 (EOS-08)ను చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 శుక్రవారం ఉదయం ప్రయోగించారు. ఆరున్నర గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న …
Read More »
amaravatinews
August 16, 2024 Business, బిజినెస్
138
Penny Multibagger Stocks: దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే స్టాక్స్ ఎన్నో ఉంటాయని చెప్పొచ్చు. వీటిని కనిపెట్టడమే కాస్త కష్టం. అయితే మార్కెట్లను రెగ్యులర్‌గా జాగ్రత్తగా గమనిస్తూ.. ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయా కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు ఇలా అన్నింటినీ పరిశీలిస్తుండాలి. అప్పుడు నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టాలి. దీంతో లాంగ్ రన్‌లో మంచి లాభాలు అందుకునే అవకాశాలు …
Read More »
amaravatinews
August 16, 2024 జాతీయం
152
ప్రపంచ ప్రముఖ సంగీత దర్శకుడు, మూడుసార్లు గ్రామీ విజేత రిక్కీ కేజ్ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా సహా సంగీత దిగ్గజాల సహకారంతో భారత జాతీయగీతం జనగణమనను (National Anthem) వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. పండిట్ హరిప్రసాద్ …
Read More »
amaravatinews
August 16, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం
163
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు …
Read More »
amaravatinews
August 16, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
279
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరారు.. వీరి కోసం ప్రత్యేకంగా అకౌంట్ నంబర్ ప్రారంభించారు. ఎస్‌బీఐ ఖాతా నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. అన్న క్యాంటీన్ల కోసం …
Read More »
amaravatinews
August 16, 2024 ఆంధ్రప్రదేశ్, చిత్తూరు
548
మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు …
Read More »
amaravatinews
August 16, 2024 ఆంధ్రప్రదేశ్
152
దిన ఫలాలు (ఆగస్టు 16, 2024): మేష రాశి వారికి ఈ రోజు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. మిథున రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సమయం బాగా అనుకూలంగా …
Read More »