amaravatinews
July 26, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం
234
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ …
Read More »
amaravatinews
July 26, 2024 ఎడ్యుకేషన్, టెక్నాలజీ
213
కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అయితే కలలు కంటున్న విద్యార్థులను లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించిన చింతల రమేష్ …
Read More »
amaravatinews
July 26, 2024 Business, జాతీయం
213
ఆకాశమే హద్దుగా దూసుకుపోయినా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు కనివినీ ఎరగని రీతిలో పతనమవుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 80 వేల మార్కును దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం రూ. 70 వేలలోపు నమోదవుతోంది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో… ఆకాశమే హద్దుగా దూసుకుపోయినా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు కనివినీ ఎరగని రీతిలో పతనమవుతున్నాయి. ఒకానొక …
Read More »
amaravatinews
July 26, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, రాశిఫలాలు
216
దిన ఫలాలు (జూలై 26, 2024): మేష రాశి వారికి మీ దగ్గర బంధువుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) పిల్లల చదువుల మీద …
Read More »
amaravatinews
July 25, 2024 ఆంధ్రప్రదేశ్
197
ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. సీరియస్‌గా మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో సభలో నవ్వులు విరిశాయి. అంతేకాదు సభలోని మెజారిటీ సభ్యులు లేచి నిల్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు మాటతో వారంతా లేచి నిల్చోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగిందనే సంగతికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అనే అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు. …
Read More »
amaravatinews
July 25, 2024 ఆంధ్రప్రదేశ్, క్రైమ్
242
యువకులు మ్యాట్రీమోనీలో పెళ్లి సంబంధాల కోసం చూస్తుంటారు. తమకు నచ్చిన అమ్మాయి కోసం రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. అవతలి వైపు నుంచి అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంబంధం సెట్టు.. అయితే మ్యాట్రీమోనీ రిక్వెస్ట్‌లు, అమ్మాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు. అమ్మాయి అందంగా ఉంది కదా అని టెంప్ట్ అయితే నిండా మునిగిపోయినట్లే.. అందుకే మ్యాట్రీమోనీ విషయంలో జాగ్రత్తలు తప్పవు మరి. తాజాగా విశాఖపట్నంలో అదే జరిగింది.. ఓ యువకుడు మ్యాట్రీమోనీలోకి వెళ్లి ఓ మహిళ చేతిలో మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో …
Read More »
amaravatinews
July 25, 2024 World, అంతర్జాతీయం
270
భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలని తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత ఈశాన్య రాష్ట్రం మణిపూర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్‌తో పాటు మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. భారత్‌లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను హెచ్చరించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది. అలాగే, తూర్పు లడఖ్, లేహ్ మినహా జమ్మూ కశ్మీర్‌లోని …
Read More »
amaravatinews
July 25, 2024 Business, అంతర్జాతీయం, జాతీయం, బిజినెస్
252
Gold Rate Today: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పసిడిని ఎక్కువగా ఇష్టపడేది భారతీయులేనని చెప్పక తప్పదు. వందల సంవత్సరాల నుంచి బంగారాన్ని ఆభరణాలుగా ధరించే సంస్కృతి భారత్‌లో కొనసాగుతోంది. ఎక్కువగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో పురుషులు సైతం బంగారు నగలు ధరిస్తున్నారు. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా పసిడికి డిమాండ్ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ …
Read More »
amaravatinews
July 25, 2024 ఆంధ్రప్రదేశ్, బిజినెస్
248
ఏపీలో మందబాబులకు అలర్ట్.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేశారు.. కీలక అంశాలను ప్రస్తావించారు. మద్యం విధానం స్థానంలో కొత్త మద్యం, బార్ల విధానాన్ని తీసుకొస్తామని.. నిపుణుల కమిటీ లేదా కేబినెట్ సబ్ కమిటీతో మద్యం విధానంపై అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీని అత్యుత్తమ ఆచరణలతో ఉండేలా దీన్ని రూపొందిస్తామని.. మద్యం ధరల్ని సమీక్షించి, పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో …
Read More »
amaravatinews
July 25, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
227
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. టీటీడీ మరోసారి వేలం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర …
Read More »