మణికంఠ మిడ్ వీక్ ఎలిమినేషన్.! వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్న హౌస్ ‌మేట్స్

నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా. ఆ లెక్కన చూస్తే నేడు (బుధవారం) మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే.. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న టాస్క్‌లను బేస్ చేసుకుని అందులో అనర్హుడు అన్న వాళ్లని హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా అంటే.. ఓటింగ్‌ని బట్టి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగే ప్రసక్తే లేదు.

ఎందుకు అంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకూ కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లో ఉంటాయి. ఒక్క సిచ్యువేషన్ చాలు ఓటింగ్ గ్రాఫ్‌ని మార్చేయడానికి. కాబట్టి… ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది కాబట్టి.. ఓటింగ్ కంప్లీట్ కాకుండా దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. కాబట్టి.. ఖచ్చితంగా హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు జరుగుతున్న టాస్క్‌లలో పెర్ఫామెన్స్‌ని బట్టి.. ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో చెప్పాలని అన్నప్పుడు హౌస్ మేట్స్ మొత్తం రెండో ఆలోచన లేకుండా మణికంఠ పేరు చెప్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

యష్మీ గౌడ అయితే మణికంఠపై పగ పట్టి.. విషం చిమ్ముతూనే ఉంది. కాబట్టి.. ఆమె ఖచ్చితంగా మణికంఠ పేరు చెప్తుంది. పృథ్వీ, నిఖిల్‌లు కూడా.. ఆమె పడగ నీడలో నుంచే మణికంఠపై విషం చిమ్ముతున్నారు కాబట్టి.. ఆ ముగ్గురూ కూడా మణికంఠనే అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక తన సొంత క్లాన్‌లో కూడా.. మణికంఠ అర్హుడు అని చెప్పే వాళ్లు లేనే లేరు. నబీల్, ఆదిత్య ఓంలు మణికంఠకి వైపు మొగ్గు చూపించినా కూడా.. హౌస్ మొత్తం ప్రతివారం లాగే అనర్హుడి జాబితాలో మణికంఠను చేర్చే అవకాశం ఉంది కాబట్టి… మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే.. హౌస్ నిర్ణయం ప్రకారం మణికంఠని తప్పించవచ్చు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బిగ్ బాస్‌కి కావాల్సింది కూడా ఇదే. హౌస్ మొత్తం ఎలాగూ మణికంఠను టార్గెట్ చేస్తారనేది ఆడియన్స్‌‌తో పాటు బిగ్ బాస్‌కి కూడా ముందే తెలుసు. అందుకే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ పెట్టింది కూడా. హౌస్ మొత్తం మణికంఠని టార్గెట్ చేసి అతన్ని మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేస్తే.. అప్పుడు బిగ్ బాస్ సీక్రెట్ రూం అస్త్రాన్ని బయటకు తీస్తారు. ఒక కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయడాలంటే.. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టి ఎలిమినేట్ చేయాలి తప్పితే.. హౌస్ మేట్స్‌కి ఆ అధికారం లేదని ట్విస్ట్ ఇస్తూ.. మణికంఠను సీక్రెట్ రూంకి పంపించి అసలు ఆట అప్పుడు ఆడిస్తాడు బిగ్ బాస్.

About amaravatinews

Check Also

రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

తెలంగాణ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *