దేవర ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్.. కానీ!

ఎన్టీఆర్ ఆరేళ్ల తరువాత సోలోగా థియేటర్లోకి వచ్చాడు. పైగా రాజమౌళి మిత్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అని కూడా అంతా ఎదురు చూశారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందా? అని ఫ్యాన్స్‌తో పాటుగా, నార్మల్ ఆడియెన్స్ సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మిడ్ నైట్ షోలతో టాక్ మొత్తం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో.. ఆడియెన్స్ రియాక్షన్ ఏంటో ఓ సారి చూద్దాం.

దేవర బ్లాక్ బస్టర్.. ఇదేమీ నార్మల్ యాక్షన్ మూవీ కాదు.. విజువల్‌గా ఇదొక ఎపిక్ మూవీ.. స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, హంటింగ్ స్కోర్ ఇలా అన్నింట్లోనే దేవర ది బెస్ట్ అనిపిస్తుంది.. ఎన్టీఆర్ అదరగొట్టేశాడు.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. టైటిల్ కార్డ్, ఎన్టీఆర్ ఎంట్రీ.. సూపర్బ్‌గా ఉన్నాయి.. అనిరుధ్ ఆర్ఆర్, ఇంట్రవెల్ సీన్, సైఫ్ నటన ఇలా అన్ని అదిరిపోయాయి.. బ్లాక్ బస్టర్ మూవీ అని అంటున్నారు.

తారక్ ఎంట్రీ.. ఆయుధ పూజ సాంగ్, ప్రీ ఇంట్రవెల్, ఇంట్రవెల్, ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. ఇప్పటి వరకు అయితే సూపర్ హిట్ బొమ్మ.. సెకండాఫ్ కోసం వెయిటింగ్ అంటూ రిపోర్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే అన్ని చోట్లా ఫస్ట్ హాఫ్ రిపోర్టులే కనిపిస్తున్నాయి. ఒంటి గంటల షోలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.

About amaravatinews

Check Also

సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ.. బుల్లి రాజే హైలెట్

సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి, వెంకటేష్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రమోషన్స్, ఆ హంగామా అందరికీ తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *