దేవరకు ప్రభుత్వ అనుమతులు.. సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు

దేవర సినిమాకు ఏపీ ప్రభుత్వం కోరినంత, కావాల్సినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చింది. మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున ఆరు షోలు పడతాయి. ఆ తరువాత ఐదు షోలు ఉంటాయి. తొమ్మిది రోజుల పాటు పెరిగిన రేట్లు, అదనపు షోలతో దేవర ఏపీలో రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది. తమ సినిమాకు ఇన్ని వెసులు బాట్లు కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్‌గా థాంక్స్ చెప్పుకొచ్చారు.

దేవరకు ఏపీలో టికెట్లు భారీగానే ఉండేలా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులో గరిష్టంగా రూ. 130 పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో గరిష్టంగా రూ. 110 పెంచుకునే వీలు ఇచ్చారు. సెప్టెంబర్ 26 అర్దరాత్రి దాటిన తరువాత మొదటి షో పడుతుంది. అలా సెప్టెంబర్ 27న ఏపీ అంతటా ఆరు షోలు నడుస్తాయి. తొమ్మిది రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీ అయింది.

దేవర హక్కుల్ని సొంతం చేసుకున్న సితార నాగవంశీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాడు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పాడు. ఆ తరువాత మరో ట్వీట్ వేస్తూ చంద్రబాబు, లోకేష్‌లకు థాంక్స్ చెప్పాడు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఒకేసారి ట్వీట్ వేశారు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌లకు థాంక్స్ చెప్పారు. మా దేవర సినిమాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు వేసిన ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే దేవర ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ముంబై, చెన్నైల్లో ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ చేశాడు. ఇక నెక్ట్స్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే దేవరను ప్రమోట్ చేసే పనిలో తారక్ ఉంటాడనిపిస్తుంది. మిడ్ నైట్ షోలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయా? నెగెటివ్ అవుతాయా? అన్నది ఇంకో ఐదారు రోజులు ఆగితే తెలుస్తుంది.

About amaravatinews

Check Also

మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియకు ఉచిత సలహా..

మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఆరోపణలు చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *