నెల్లూరులో గోల్డ్‌మెన్ సందడి చేశారు.. ఒంటి నిండా బంగారంతో నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. కర్ణాటకకు చెందిన గోల్డ్‌మెన్ రిజమూన్ నెల్లూరు వచ్చారు. ఆయన ఒంటిపై ఏకంగా 2 కిలోలకుపైగా బంగారంతో కనిపించారు. రిజమూన్ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో 31 ఏళ్లుగా స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ 30 ఎకరాల కాఫీ ఎస్టేట్ ఉంది.. రెడ్‌లన్స్ కంపెనీ రీజినల్ మేనేజర్‌గా ఆరు రాష్ట్రాలు చూస్తున్నారు.
తనకు ఐదు భాషలు వచ్చని.. తెలుగు కూడా త్వరలో నేర్చుకుంటానని చెబుతున్నారు రిజమూన్. సింగర్ హనిసింగ్ బంగారు వాచ్, బ్రాస్‌లెట్లు, చైన్లు వేసుకుని ముంబైలో పాటలు పాడుతారని.. ఆయన్న చూసి 2010 నుంచి బంగారంపై తనకు ఆసక్తి పెరిగిందన్నారు. ఎప్పటికైనా తన ఒంటిపై 5 కిలోల బంగారం వేసుకోవాలనే లక్ష్యం ఉందన్నారు. తాను నెల్లూరులో ఓ డీలర్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. మరోవైపు రిజమూన్‌ను చూసినవార సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. మొత్తం మీద ఈ కర్ణాటక గోల్డ్‌మెన్ నెల్లూరులో సందడి చేశారు.
ఇటీవల తిరుమలలో కూడా గోల్డెన్ బాయ్స్ సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్తలు భారీగా బంగారు నగలు ధరించి శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. పుణెకి చెందిన సన్నీ ననవాగ్చోరీ, సంజయ్, ప్రీతిసోనిలు.. దాదాపు 25 కిలోల ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు రాగా.. వారి ఒంటిపై అంత బంగారం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ననవాగ్చోరీ, సంజయ్ ఒంటిపై చెరో 10 కిలోల చొప్పున, ప్రీతి ఒంటిపై 5 కిలోల బరువున్న నగలు ఉన్నాయి. అంతేకాదు వీరికి సెక్యూరిటీగా 15మంది ఉన్నారు. తిరుమలలో భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఏపీ, తెలంగాణలో కూడా పలువురు గోల్డ్‌మెన్‌లు ఉన్నారు.. వీరు తిరుమల వచ్చిన ప్రతిసారి హైలైట్ అవుతుంటారు.. వీరు ఒంటిపై కిలోల కొద్ది బంగారంతో శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. వీరిని చూసిన భక్తులు ఎలాగైనా సరే ఒక్కసెల్ఫీ తీసుకోవాాలని పోటీపడుతుంటారు.