మహేష్ బాబు పుట్టినరోజు వస్తే చాలు ఫ్యాన్స్ ఆ నెల మొత్తం పండగలా జరుపుతుంటారు. సినిమాల పరంగానే కాకుండా ఎదుటివారికి సాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుడే మహేష్ అంటే అభిమానులకి ప్రాణం. అందుకే ఆగస్టు 9న వాళ్ల సెలబ్రేషన్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఇక ఈ రోజు మహేష్ బాబు కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ కూడా ఉంది. ఇంకేముంది థియేటర్లలో పండగా చేస్తున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి.
అక్షింతలు, బాజాలు
మురారి సినిమాలోని ‘అలనాటి రామచంద్రుడు’ పాట ఎంత పెద్ద హిట్ అనే సంగతి చెప్పక్కర్లేదు. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటిపోయినా ఎప్పుడు ఎక్కడ పెళ్లి జరిగినా ఇప్పటికీ మురారిలోని ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, సోనాలి బింద్రే చిలిపితనం, సాంగ్స్, కృష్ణవంశీ డైరెక్షన్ అన్నీ వేరే లెవ్లో ఉంటాయి. అలాంటి సినిమాను మహేష్ పుట్టినరోజుకి రీరిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ థియేటర్లో వేడుక చేస్తున్నారు.