భార్య ముందు అంకుల్ అన్నాడని.. బట్టల షాపు ఓనర్‌ను చితగ్గొట్టిన యువకుడు!

భార్యతో కలిసి ఓ బట్టల దుకాణానికి వెళ్లిన వ్యక్తిని.. షాప్ ఓనర్ అంకుల్ అని పిలవడంతో అతడి ఇగో దెబ్బతింది. దుకాణదారుడితో గొడవపడిన అతడ్ని.. భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం దానిని జీర్ణించుకోలేక.. అంతటితో వదిలిపెట్టలేదు. కాసేపటికే తన స్నేహితులను వెంటేసుకుని వచ్చి ఆ షాప్ ఓనర్‌ను చితగ్గొట్టాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. భోపాల్‌కు చెందిన విశాల్ శాస్త్రికి స్థానికంగా జాట్ ఖేడి ప్రాంతంలో ఓ వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే తన దుకాణానికి వచ్చిన కస్టమర్లకు ఆయన బట్టలు చూపిస్తున్నాడు. ఇంతలో భుజాన చంటిపిల్లాడితో ఓ జంట శాస్త్రి షాపునకు వచ్చింది. తమకు చీరలు కావాలనడంతో వివిధ వెరైటీలను చూపించాడు. ఈ క్రమంలోనే శాస్త్రి మీకు ఏ ధరలో కావాలని అడిగితే.. రూ.1000 వరకు చీరలు చూపించాలని చెప్పాడు. అయితే, పుసుక్కున అంకుల్ ధర ఎక్కువైనా పర్వాలేదా? అని ఆ కస్టమర్‌ను ఉద్దేశించి అడిగాడు. అంతే, అతడి శివాలెత్తిపోయాడు. నన్ను అంకుల్ అని పిలవొద్దన్నాడు. భార్య ముందే తనను అంకుల్ అని పిలవడాన్ని తట్టుకోలేకపోయాడు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాస్త్రితో వాగ్వాదానికి దిగాడు. అతడి భార్య వారించి, సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఇంతటితో గొడవ సద్దుమణిగిందని అనుకునేలోపే సదరు కస్టమర్ తన స్నేహితులతో వచ్చి శాస్త్రిపై దాడికి పాల్పడ్డాడు. దుకాణంలో నుంచి శాస్త్రిని బయటకు ఈడ్చుకొచ్చి బెల్ట్, రాడ్, హాకీ స్టిక్‌లతో చితకబాదారు. ఈ దృశ్యాలు షాపు ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. శాస్త్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు కస్టమర్‌ను రోహిత్‌గా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

About amaravatinews

Check Also

ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *