SIP Calculator: పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కాస్త రిస్క్ ఉన్నా కూడా లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది. స్థిరంగా రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ ఏం లేనప్పటికీ.. పాస్ట్ రిటర్న్స్ చూస్తూ.. ఏ స్కీమ్ ఎలా పెర్ఫామ్ చేసింది తెలుసుకొని సరైన పథకం ఎంచుకోవాలి. అప్పుడు నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే.. మ్యూచువల్ ఫండ్లలో లంప్ సమ్ (ఏకకాలంలో పెట్టుబడి) లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఇలా రెండు రకాలుగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది మాత్రం సిప్ ఎంచుకుంటుంటారు. ఇక్కడ నెలకు నిర్దిష్ట మొత్తం ఇన్వెస్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి.మ్యూచువల్ ఫండ్లలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. కాంపౌండింగ్. అవును ఇక్కడ చక్రవడ్డీ వస్తుంది. అంటే అసలుపై వడ్డీ సహా.. మళ్లీ కాలం గడుస్తున్న కొద్ది వడ్డీపైనా వడ్డీ పెరుగుతుందని చెప్పొచ్చు. అందుకే.. రిటర్న్స్ దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.
అయితే నెలకు ఎంత సిప్ చేస్తే.. ఏ వయసులో స్టార్ట్ చేస్తే.. ఎన్నేళ్లలో ఎంత వస్తుందో తెలుసుకుందాం. సిప్ కాలిక్యులేటర్స్ చాలానే ఉంటాయి. దీని ద్వారా అంచనా శాతంతో రాబడి లెక్కగట్టొచ్చు. ఉదాహరణకు 20 సంవత్సరాల వయసులో రూ. 1000 సిప్ ప్రారంభించొచ్చు. లేదా 30 ఏళ్లకు రూ. 3 వేల సిప్, 40 ఏళ్లకు రూ. 4 వేల సిప్ ప్రారంభిస్తే.. రిటైర్మెంట్ అంటే 60 ఏళ్లకు చేతికి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసుకుందాం. సాధారణంగా సగటున వార్షిక ప్రాతిపదికన 12 శాతం రాబడి అంచనా వేసి చూద్దాం.