బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది. ఊహించని ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయి ఈ ప్రోమోలో. ఇక కంటెస్టెంట్స్‌ని కనిపించకుండా చేశారు కానీ.. వాళ్ల మాటల్ని బట్టి చూస్తే ఎవరెవరు? ఉన్నారో.. హౌస్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయో ప్రోమోలో చూద్దాం.
‘‘నేను మాత్రం మీ కళ్లల్లోకి చూసి మాట్లాడలేను.. ఎందుకంటే.. ఆ కళ్లల్లోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క అప్పుడే పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. ఈమె పులిహోర కలపడంలో దిట్ట అని.. రోషణ్ ఇంటర్వ్యూలోనే తెలిసింది. ఇప్పుడు నాగార్జున ముందు పోపులు కాస్త ఎక్కువ వేసింది.
హౌస్‌లో ఎవర్నైనా పార్టనర్‌ని వెతుక్కుంటున్నావా? అంటూ నాగార్జున పెళ్లిళ్ల పేరయ్య పని స్టార్ట్ చేసేశారు. ఇంతకీ ఆ మాట ఎవర్ని అన్నారంటే సీరియల్ నటుడు నిఖిల్‌ని. నన్ను శత్రువుగా చూస్తే మాత్రం.. బిగ్ బాస్ టైటిల్ పట్టుకునిపోతానంటున్న వ్యక్తి ఎవరో కాదు.. శేఖర్ బాషా. ముందుగా చెప్పినట్టే.. బిగ్ బాస్ హౌస్‌లోకి సోలో ఏంట్రీ లేదు.. జంటగా వెళ్లాలని అంటున్నారు నాగార్జున. అన్నట్టుగానే ఇద్దరిద్దర్ని జంటగా పంపిస్తున్నారు. మీరు జంటలుగా వెళ్లండి.. జంటగానే ఆడండి.. ఎఫైర్లు పెట్టుకోండి.. మాకు కావాల్సిన ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పకనే చెప్పేస్తున్నారు.