ఎస్బీఐ నుంచి కొత్త స్కీమ్.. ఒక్కరోజే ఛాన్స్.. కనీసం రూ. 500 పెట్టుబడితో షురూ..

పెట్టుబడులు పెట్టేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇలా చాలా ఉంటాయి. అయినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపైనా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటారు. ఇక్కడ సిప్ అంటే నెలనెలా కొంత మొత్తం పెట్టుబడి ద్వారా మంచి రిటర్న్స్ అందుకుంటారు. ముఖ్యంగా కాంపౌండింగ్ (చక్రవడ్డీ) కారణంగా దీంట్లో అసలు పెట్టుబడికి ఎన్నో రెట్ల మేర సంపద వచ్చి చేరుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్‌న్యూస్.

ఎస్‌బీఐ ఒక సరికొత్త థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ప్రారంభించింది. అదే ఎస్బీఐ ఇన్నొవేటివ్ అపార్చునిటీస్ ఫండ్. జులై 29నే ఇది సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. ఆగస్ట్ 12 అంటే ఇవాళే ఆఖరి తేదీగా ఉంది. ఎక్కువగా ఆవిష్కరణల కోసం ఆర్ అండ్ డీలో ఇన్వెస్ట్ చేసే కంపెనీల షేర్లలో ఇది పెట్టుబడులు పెడుతుందని చెప్పొచ్చు. ప్రసాద్ పాదాల.. ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు.

ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఇది థిమాటిక్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. ఇన్నొవేటివ్ అపార్చునిటీస్ నేపథ్యంలో ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంగా ఉంది.

ఈ పథకంలో భాగంగా కనీసం రూ. 5000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకేసారి పెట్టుబడి అయితే వర్తిస్తుంది. అదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) కింద ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టాలి. రూ. 1 మల్టిపుల్స్‌తో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో ఇప్పటికే ఇలాంటి ఒక స్కీమ్ యూనియన్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తుంది. అదే యూనియన్ ఇన్నొవేషన్ అండ్ అపార్చునిటీస్ ఫండ్.

ఏదేమైనా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ లేకుండా లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. వీటిల్లో టాక్స్ సేవింగ్ పెట్టుబడులు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి కూడా మంచి బెనిఫిట్స్ అందిస్తాయి. టాక్స్ సేవింగ్ అంటే ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పాత పన్ను విధానం కింద పన్ను తగ్గించుకోవచ్చు.

About amaravatinews

Check Also

CAT 2024 Result Date: క్యాట్ 2024 ‘కీ’ విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- కామన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *