తిరుమలలో భక్తుల ముసుగులో తమిళనాడు మహిళల అతి తెలివి.. ఇలాంటోళ్లతో జాగ్రత్త

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమమైన గమనిక.. మరో కొత్తరకమైన మోసం బయటపడింది. తిరుపతితో పాటూ తిరుమలలో కొందరు మహిళలు రెచ్చిపోతున్నారు. మహానటి చంటి బిడ్డలను చంకన పెట్టుకుని రేంజ్‌లో నటిస్తారు. అదును చూసి.. ఏమార్చి చోరీ చేసి పారిపోతారు. తిరుమలలోనూ భక్తుల ముసుగులో డబ్బు, నగలు, మొబైల్స్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దర్ని అరెస్ట్ చేశారు తిరుపతి పోలీసులు.

తమిళనాడు తూత్తికోరిన్‌ జిల్లా మంతితోప్పుకు చెందిన భగవత్‌ శారద, ప్రియలు మంచి స్నేహితులు. ఏడేళ్లుగా వీరు తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, వెంకటగిరి జాతరను టార్గెట్ చేశారు. అలాగే తిరుమల కొండపై రద్దీ రోజుల్లో వచ్చి వెళుతుంటారు. తిరుపతిలోని శ్రీనివాసం, ఉచిత సత్రాలు దగ్గర ఆ కొద్దిరోజులు తలదాచుకుంటారు.. అవకాశం దొరికిన చోట టైం చూసి దొంగతనాలు చేస్తుంటారు. తిరుపతిలో ఈ తరహాలో చోరీలు చేశారు.

తిరుపితి మాత్రమే కాదు తిరుమలకు వెళతారు.. అక్కడ భక్తులు ఉచిత బస్సులు ఎక్కే సమయంలో, రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తుల బ్యాగుల్లోని విలువైన బంగారం, డబ్బులు, మొబైల్స్ కొట్టేస్తుంటారు. తిరుమలలో రెండు.. తిరుపతి పోస్టల్‌ కాలనీలో జరిగిన ఓ దొంగతనంపై క్రైం పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అదనపు ఎస్పీ నాగభూషణరావు, క్రైం డీఎస్పీ రమణకుమార్‌, సీఐ అబ్బన్నలు కానిస్టేబుల్స్‌తో ఓ టీమ్‌లను రంగంలోకి దించారు.

ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేయగా.. వారిని పాత నేరస్తులుగా గుర్తించారు పోలీసులు. వీరు గతంలో పలు సందర్భల్లో అరెస్టయ్యారని.. ఈ క్రమంలో ఫొటోల ఆధారంగా విష్ణునివాసం దగ్గర చంకలో బిడ్డలను పెట్టుకుని తిరుగుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి రూూ.6లక్షల విలువైన బంగారం, మొబైల్స్ సీజ్ చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇలాంటి దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

About amaravatinews

Check Also

రోజూ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందా..? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

యాలకులు.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే సుగంధ్ర ద్యవ్యాలలో ఇది కూడా ఒకటి. వంటలకు రుచిని, సువాసన పెంచడానికి యాలకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *