మహాసేన రాజేష్‌పై కేసు నమోదు.. మహిళ ఫిర్యాదుతో, మార్ఫింగ్ ఫోటోలపై!

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్)పై కేసు నమోదైంది. ఆయన అనుచరులు రంజిత్‌మెహర్‌ (రాజోలు), యెల్లమిల్లి పండు (తూర్పుపాలెం), బోడపాటి చక్రి (తుని), వీరవల్లి ఏసుబాబు (భీమవరం), పృథ్వీరాజ్‌లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి ఈ నెల 12న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి మార్ఫింగ్‌ ఫొటోలపై స్పష్టత కోసం ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశామని.. వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటాము అన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కించపరిచేలా పోస్టు పెట్టిన కేసులో శాంతి భర్త నానిపై ఇటీవల రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన పేరిట ఎవరో నకిలీ ఖాతాలు తెరిచారని, ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు మహాసేన రాజేష్.సరిపెళ్ల రాజేష్‌ మహాసేన పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దుతు తెలిపారు.. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. కొంతకాలానికి రాజేష్ వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలతో టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.. అయితే ఆ తర్వాత రాజేష్ జనసేన పార్టీకి దగ్గరయ్యారు.. ఆ పార్టీలో చేరతారని భావించారు.. కానీ చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు.ఆ తర్వాత పరిణామాలతో ఆయన టీడీపీలో చేరారు.. ఆయనకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. అయితే అనూహ్యంగా ఆయనకు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పీ గన్నవరం సీటు కేటాయించింది. అయితే రాజేష్‌కు టికెట్ రావడాన్ని కొందరు వ్యతిరేకించారు.. దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత రాజేష్ జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి.. ఆ పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానన్నారు. మహాసేన రాజేష్ టీడీపీలోనే కొనసాగుతున్నారు.

About amaravatinews

Check Also

ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్‌లో షాకింగ్ సీన్..!

రాత్రి కిడ్నాప్.. ఉదయానికి శవమై కనిపించిన కాంట్రాక్టర్.. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ కిడ్నాప్ అండ్ మర్డర్ సంచలనం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *