ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. కల్కి చిత్రం వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయబోతోంది. ఈ మేరకు అమెజాన్ నుంచి అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఇక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కల్కి ఓటీటీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిపీట్ మోడ్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను చూస్తామంటూ సంబరపడిపోతోన్నారు. ఆగస్ట్ 22 నుంచి కల్కి చిత్రం ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ సినిమా విషయంలో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. కల్కి ఓటీటీని రెండు సంస్థలు పంచుకున్నాయి. దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ అందిస్తోంది.. హిందీలో కావాలనుకునే వాళ్లు నెట్ ఫ్లిక్స్‌లో చూసుకోవాల్సిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో కావాలనుకునే వాళ్లు ప్రైమ్ వీడియోలో చూసుకోవచ్చు. హిందీ భాషలో చూడాలనుకునే వారు నెట్ ఫ్లిక్స్‌ను ఆశ్రయించాల్సిందే.
ఇక రోజూ ఆ లాస్ట్ 30 నిమిషాల ఎపిసోడ్స్‌ను చూస్తూ ఉంటాం.. ఓటీటీ రికార్డ్స్‌ను బద్దలు కొడతాం అంటూ రెబల్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమానే ఎన్నో వారాల పాటు వరల్డ్ వైడ్‌గా, నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అయింది. ఇక కల్కి సినిమాను ఎన్ని వారాలు ట్రెండ్ చేస్తారో చూడాలి. ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద అయితే రికార్డులు బద్దలు కొట్టేసింది. కల్కి దాదాపుగా పదకొండు వందల కోట్లకు పైగానే రాబట్టిందని సమాచారం.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్ హాసన్ వంటి వారు పోషించిన పాత్రలకు వచ్చిన రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక పార్ట్ 2 కోసం ఇండియన్ ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సుప్రీమ్ యాస్కిన్ ఏం చేస్తాడు.. అశ్వథ్థామ, కర్ణ పాత్రలు ఎలా ఉండబోతోన్నాయని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.