Canada: దేశం నుంచి కెనడియన్లనే వెళ్లిపొమ్మంటున్న ఖలిస్థానీలు.. కెనడా మాదే అంటూ నినాదాలు

Canada: రోజురోజుకూ కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ నిత్యం ఏదో ఒక చోట నానా హంగామా సృష్టిస్తున్న ఖలిస్థానీలు.. తాజాగా తెల్లజాతివారిపై పడ్డారు. తాజాగా కెనడాలోని శ్వేత జాతీయులను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. అసలైనా కెనడా తమదేనని.. తెల్లజాతివారే ఇతర దేశాల నుంచి కెనడాకు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేతజాతీయులు అంతా యూరప్‌కు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా ఓ ఖలిస్థానీ మద్దతుదారుడు విడుదల చేసిన ఓ వీడియోలో.. కెనడాకు యజమానులం తామేనని తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారడం సంచలనంగా మారింది.

ఆ వీడియోలో కెనడియన్లను ఆ ఖలిస్థానీ మద్దతుదారుడు.. దురాక్రమణదారులుగా అభివర్ణించాడు. కెనడా యజమానులం తామే అంటూ 2 నిమిషాల వీడియోను విడుదల చేశాడు. “ఇది మా దేశం. మేం కెనడా యజమానులం. మేం గొప్ప కెనడియన్లం. మీరు తిరిగి యూరప్‌ లేదా ఇంగ్లండ్‌కు వెళ్లిపోండి. మీరు కెనడియన్లు కాదు. మేమే కెనడియన్లం. మీరు దురాక్రమణదారులు. శ్వేత జాతీయులారా తిరిగి యూరప్‌నకు వెళ్లిపొండి” అని తీవ్ర హెచ్చరికలు చేశాడు.

About amaravatinews

Check Also

అదంతా మోదీ క్రెడిటే.. భారత ప్రధానిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో.. భారతదేశం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణలతో సహా అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *