ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు భువనేశ్వర్‌- కేఎస్‌ఆర్‌ బెంగుళూరు (18463), 15 నుంచి 22 వరకు కేఎస్‌ఆర్‌ బెంగళూరు- భువనేశ్వర్‌(18464) రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ బోగీని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఈ నెల 16న భువనేశ్వర్‌- తిరుపతి (22879), 17న తిరుపతి- భువనేశ్వర్‌ (22880) రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ అదనపు బోగీని జత చేస్తామన్నారు.

అలాగే ఈ నెల 15 నుంచి 30 వరకు విశాఖ- న్యూఢిల్లీ (20805).. ఈ నెల 17 నుంచి డిసెంబరు 2 వరకు న్యూఢిల్లీ- విశాఖ (20806) రైళ్లకు ఓ సెకండ్‌ ఏసీ బోగీని జత చేస్తారు. ఈ నెల 24న విశాఖ- లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ (22847).. 26న లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌- విశాఖ(22848) రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 28న విశాఖ- డిఘా (22874).. ఈ నెల 29న డిఘా-విశాఖ(22873) రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ బోగీని.. ఈ నెల 20, 27 తేదీల్లో గాంధీదామ్‌- పూరీ(22973).. ఈ నెల 23, 30 తేదీల్లో పూరీ- గాంధీదామ్‌ (22974) రైళ్లకు ఓ స్లీపర్‌ క్లాస్‌ బోగీని అదనంగా జత చేయనున్నారు. బుధవారం రాత్రి 11.55 గంటలకు బయల్దేరాల్సిన హౌరా-ఎంజీఆర్ చెన్నై (12839) మెయిల్ దాదాపు 7 గంటలు ఆలస్యంగా 14న ఉదయం 7 గంటలకు బయల్దేరి వెళ్లింది.

మరోవైపు గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) రైలును నేడు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వచ్చే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు(17240)ను ఈ నెల 15వ తేదీన రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

About amaravatinews

Check Also

తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఫెయింజల్ తుఫాన్ అలజడి రేపింది.. తీరం దాటినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *