తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ రైలు రద్దు చేశారు, మరో రెండు రైళ్లకు అదనపు స్టాప్‌లు

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైమన గమనిక.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 11 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ-కడప మధ్య నడిచే రైలు (17488 ) ఈ నెల 5 నుంచి 10 తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖ రైలు (17487) ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. విజయవాడ సమీపంలో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

మరోవైపు విజయవాడ, చెన్నై మధ్య నడిచే పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ రైలును (12711/12712) కూడా ఈ నెల 10 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. విజయవాడలో డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-విజయవాడ (12077), విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (12078) జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 5 నుంచి 10వ తేది వరకు పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారుతు తెలిపారు. బిట్రగుంట- చెన్నై సెంట్రల్‌ (17237), చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట ఎక్స్‌ప్రెస్‌ (17238) ఆగస్టు 4 నుంచి 11వ తేది వరకు పూర్తిగా రద్దు చేశారు అధికారులు.

హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు తాంబరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ (12760) రైలును ఆగస్టు 2 నుంచి 10వ తేది వరకు వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడకు బదులుగా.. పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలుకు నల్గొండ, గుంటూరులో అదనపు హాల్ట్‌ ఇచ్చారు. తాంబరం నుంచి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్ (12759) రైలు ఆగస్టు 2 నుంచి 10వ తేది వరకు విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌, మహబాబాబాద్‌ వరంగల్‌, ఖాజీపేటకు బదులుగా.. తెనాలి, గుంటూరు, పడిగిపల్లి మీదుగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలుకు గుంటూరు, నల్గొండలో అదనపు స్టాప్‌లు ఇచ్చారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *