Ratan Tata Networth: మార్కెట్ విలువ పరంగా భారత్‌లో టాటా గ్రూప్ అతిపెద్దది. దీని మార్కెట్ విలువ రూ. 30 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. పలు దేశాల జీడీపీ కంటే కూడా దీని విలువే ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో టాటా సన్స్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా పాత్ర కీలకం. దశాబ్దాల పాటు సంస్థకు నేతృత్వం వహించి సంస్థను విస్తరించారు. ఆయన నేతృత్వంలో దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించి.. ఎందరికో ఉపాధి కల్పించింది టాటా గ్రూప్. రతన్ టాటా.. అక్టోబర్ 9న వయో సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచారు. దీంతో.. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాను నియమించగా.. ఇప్పుడు రతన్ టాటా ఆస్తుల గురించే అంతా చర్చించుకుంటున్నారు.
నిజానికి రతన్ టాటా.. తన సంపదలో పెద్ద మొత్తంలో విరాళాలకే కేటాయించారు. సగానికిపైగా దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చించారు. ఇంకా ట్రస్టులకు రాసిచ్చారు. మరి టాటా ఆస్తి ఎవరికి చెందుతుంది..? ఆయనకు ఎంత సంపద ఉంది.. వీలునామా రాశారా.. దాని బాధ్యత ఎవరిది.. ఇలా టాటా ఆస్తి గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. టాటా సంపద గురించి, ఆయన వీలునామా గురించి పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.