రియల్‌మీ జీటీ 6టీ వచ్చేస్తోంది.. ఈనెల 20 నుంచి సేల్స్ ప్రారంభం

Realme GT 6T Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. రియల్‌మీ జీటీ 6టీ (Realme GT 6T) పేరిట మరో ఫోన్‌ను కలర్ ఆప్షన్‌లో త్వరలో భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ (Amazon Prime Day Sale 2024) ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్‌మీ తన రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ను మరో కలర్ ఆప్షన్ లో తీసుకొస్తోంది. ఈఏడాది మే నెలలో రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ భారత్ మార్కెట్లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ (Amazon Prime Day Sale 2024) ప్రారంభం సందర్భంగా.. ఈ నెల 20 అర్థరాత్రి రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ మిరాకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్ విక్రయాలు ప్రారంభంకానున్నాయి. అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో మాత్రమే ఈ ఫోన్ లభిస్తుంది. రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999.. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999 ధరకు లభిస్తాయి. ఈ రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5 ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. మూడు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1264×2780 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా విత్ సోనీ ఎల్వైటీ 600 సెన్సార్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 సెన్సార్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్615 సెన్సార్ కెమెరా ఉంటాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 120 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. వినియోగదారులు పూర్తి వివరాలను అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌లలో చూడొచ్చు.

About amaravatinews

Check Also

రోజూ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందా..? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

యాలకులు.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే సుగంధ్ర ద్యవ్యాలలో ఇది కూడా ఒకటి. వంటలకు రుచిని, సువాసన పెంచడానికి యాలకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *