గుజరాత్‌ యువతిని వరించిన.. మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీలో భారత్‌ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది…

ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్‌ యూనివర్సట్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఇంతకు ముందుకు విజేతలుగా నిలిచిన వారి నుంచి చాలా నేర్చుకున్నాని రియా చెప్పుకొచ్చింది.

ఇక ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా నటి, మిస్ యూనివర్స్ ఇండియా 2015 ఊర్వి రౌటేలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ సంవత్సరం భారతదేశం మళ్లీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వాస్‌ మియూనిర్స్‌ పోటీలో ఈ ఏడాది భారత దేశానికి మిస్‌ యూనివర్స్‌ కిరీటం కచ్చితంగా వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీలో అమ్మాయిలుందరూ చాలా కష్టపడ్డారని, వారి అంకితభావం అద్భుతమని రౌటేలా కొనియాడారు.

About amaravatinews

Check Also

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే..?

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఫ్రెంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *