దేశంలో పెరిగిన బియ్యం ధరలు.. మోదీ సర్కార్ నిర్ణయంతో సామాన్యులపై భారం

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో దేశంలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే బియ్యం ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరగడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక ఇప్పటికే కూరగాయలు, వంటనూనె, ఇతర నిత్యావసరాల వస్తువుల ధరలు మండిపోతున్న వేళ.. తాజాగా బియ్యం ధరలు కూడా పెరగడంతో పండగల వేళ జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే గతేడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఆ ఆంక్షలను ఎత్తేసి.. బియ్యం ఎగుమతి చేసేందుకు అవకాశం ఇవ్వడంతో దేశంలో బియ్యం ధరల మోత మోగిపోతోంది.

ఇక దేశంలోని బాస్మతియేతర బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై గతేడాది విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు పారాబాయిల్డ్‌ బియ్యంపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ గత నెల 28వ తేదీన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో బియ్యం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేవలం గత వారం రోజుల్లోనే దేశంలో బియ్యం ధరలు దాదాపు 10 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని బియ్యం వ్యాపారులు పేర్కొంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్న బియ్యం ఎగుమతుల్లో భారత్‌ వాటా దాదాపు 45 శాతం వరకు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇరాన్‌, సౌదీ అరేబియా, చైనా, యూఏఈ, ఆఫ్రికా దేశాలకు భారత్‌ నుంచి బియ్యం ఎగుమతి అవుతుంది. అయితే బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించడంతో పాటు పారాబాయిల్డ్‌ బియ్యంపై సుంకాన్ని 20 శాతానికి పెంచింది. తాజాగా ఎగుమతులకు అవకాశం కల్పించడం మాత్రమే కాకుండా మళ్లీ సుంకాన్ని 10 శాతం తగ్గించడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే దేశంలో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం నిర్ణయంతో భారత్‌ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో దేశంలో వారం వ్యవధిలోనే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆఫ్రికాకు ఎక్కువగా ఎగుమతయ్యే స్వర్ణ రకం బియ్యం ఇంతకుముందు రూ.35 కిలో ఉండగా ఇప్పుడు రూ.41కి పెరిగింది. బాస్మతి బియ్యం మినహా మిగతా అన్ని రకాల బియ్యం ధరలు 10-15 శాతం పెరిగాయని బియ్యం ఎగుమతిదారులు చెప్తున్నారు.

About amaravatinews

Check Also

హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *