RK Roja: కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా ఖచ్చితంగా పోస్టులు పెడతాం.. మాజీమంత్రి రోజా ట్వీట్

RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం.. సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి.. ప్రతిపక్ష వైసీపీకి మధ్య సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారంలో తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతూ పోస్ట్‌లు పెట్టిన వారిపై కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు చేస్తుంటే అరెస్ట్ చేయరా అంటూ తాజాగా ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ట్విటర్ వేదికగా స్పందించారు. ఎన్నికల వేళ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా బడ్జెట్‌లో నిధులు కేటాయించక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలను మోసం చేస్తున్నారని మోసం చేస్తున్నారని.. రోజా మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై తనతోపాటు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులు నిలదీస్తూ ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతూనే ఉంటారని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని యువత, మహిళలను, రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

About amaravatinews

Check Also

ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *