జగన్ ఆస్తుల కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్‌ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్‌ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలుచేసిన కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ తప్పుకొన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్‌ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని తెలిపింది.

గతేడాది మే నెలలో హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. బుధవారం ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకొంటున్నానని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించేందుకు సిద్థమవ్వగా జస్టిస్‌ సంజీవ్‌ కుమార్‌ లేని ధర్మాసనం ముందు పిటిషన్‌ను లిస్ట్‌ చేయనున్నట్టు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబరు 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశించారు.

ఏపీలో రెడ్ బుక్ పాలన జరుగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కక్షలను ప్రోత్సహించేలా రెడ్‌బుక్‌ పాలన జరుగుతోందని.. శ్వేతపత్రాలంటూ గత ప్రభుత్వంపై నిందలు మోపలేదన్నారు. కొవిడ్‌ సమయంలో కూడా ప్రతి పథకాన్నీ ఐదేళ్ల పాటూ డోర్‌ డెలివరీ చేశామని.. అలాంటి వైఎస్సార్‌సీపీకి ఎన్నికల్లో ఈ నంబర్లు వస్తే.. అధికారంలోకొచ్చిన రెండున్నర నెలల్లోనే పథకాలు అమలు చేయకుండా శ్వేతపత్రాలని, అప్పులంటున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గ్రాఫ్‌ కిందకు పడిపోవాల్సిందే అన్నారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో సంఖ్యాబలం లేకపోయినా ఎందుకు పోటీ పెట్టాలనుకున్నారు.. అవతలివారిని ప్రలోభపెట్టి కొనేందుకే కదా.. వైఎస్సార్‌సీపీ నేతలు =విలువలకు కట్టుబడి ఒక తాటిపై నిలబడటంతో ధర్మం గెలిచిందన్నారు.

చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి, ప్రజలందరి చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్‌ పెట్టి.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారన్నారు జగన్. అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లోనే విద్యా, ఆరోగ్య వ్యవస్థలను ప్రశ్నార్థకంగా మార్చారని ధ్వజమెత్తారు. బడుల్లోఅయ టోఫెల్‌ను ఎత్తేశారని.. ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుందో లేదో.. పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తారా లేదా అనేదీ అనుమానమే అన్నారు. జగన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు.. ఎమ్మెల్సీ ఎన్నికలపై వారితో చర్చించారు. అయితే విశాఖ ఎమ్మెల్సీ స్థానం వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

About amaravatinews

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *