Tag Archives: andhra pradesh

చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …

Read More »

Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్‌ అశోక్‌పై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని అనాథ శవాల మాయం వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్‌ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాకిస్తోంది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషవ్ టీమ్‌ విచారణ వేగవంతం చేసింది. డీఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారితోపాటు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలో …

Read More »

PM Modi: ప్రధాని మోడీ వికసిత్ భారత్‌లో భాగమవ్వండి.. యువతకు పిలుపునిచ్చిన పీవీ సింధు, ఆయుష్మాన్ ఖురానా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన వికసిత్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగమయ్యారు. ఈ మేరకు వికసిత్ భారత్ ఛాలెంజ్ లో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారీ స్టార్ సెలబ్రిటీలుజాతీయ యువజనోత్సవం -2025 ను పురస్కరించుకుని ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో …

Read More »

Ashwini Vaishnaw: వాళ్ల సంగతి చూడాల్సిందే.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..

సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదేరకమైన వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేసింది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కించపర్చేలా పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. నాయకులను, మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు సైతం …

Read More »

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..

ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన …

Read More »

వైఎస్ జగన్ సొంత జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. ఢిల్లీలోని కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన పవన్ కళ్యా్ణ్.. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ సహా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు.. భేటీ అనంతరం …

Read More »

నా గన్‌మెన్‌లను వెనక్కు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని కోరారు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ (X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని.. 2019 నుంచి విశాఖపట్నంలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ …

Read More »

ఏపీలో కొత్తగా మరో గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. ఈ రూట్‌లోనే 6 లైన్లుగా, అక్కడికి 8 గంటల్లో వెళ్లిపోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు నిర్మించనున్నారు. ఈ మేరకు డీపీఆర్‌ రూపొందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. కేంద్రం ప్రధాన మంత్రి గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హైవేను నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 …

Read More »

ఏపీలో పింఛన్ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇస్తారు.. కారణం ఇదే, ఈ నెల నుంచి మరో కొత్త రూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని …

Read More »

ఏపీలో కాలేజీలకు సీరియస్ వార్నింగ్.. రూ.15 లక్షలు జరిమానా, విద్యార్థులకు పండగే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయంది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. అలా నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉందని గుర్తు చేశారు. కొన్ని విద్యా సంస్థలు కోర్సు పూర్తైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువగా …

Read More »