ఆంధ్రాను వర్షాలు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు .. తుఫాన్లతో రైతులు ఆగమవుతున్నారు. తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది.హిందూ మహాసముద్రం, దాని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకపోతే శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ, ఈ నెల 12 నాటికి శ్రీలంక, …
Read More »Tag Archives: andhra pradesh
సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ కీలక నిర్ణయం
టెక్నాలజీ యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. అమాయకులే లక్ష్యంగా సొమ్ములు కొల్లగొట్టి మోసాలకు పాల్పడటమే కాదు.. ఆ సొమ్మును ఫేక్ అకౌంట్లకు మళ్లిస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి సొమ్మును తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా నిరక్ష్యరాస్యులు, నిరుద్యోగులకు కమీషన్ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటినే మ్యూల్ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాల్లోకి వెళ్లిన సొమ్మును గుర్తించడం, రికవరీ చేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యూల్ ఖాతాల ఏరివేతే లక్ష్యంగా ఆర్‌బీఐ మ్యూల్ హంటర్ డాట్ ఏఐని …
Read More »బ్యాంకుల లూటీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. దొంగల ముఠా స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దేశవ్యాప్తంగా బ్యాంకులను టార్గెట్ చేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లాకర్లలోని బంగారం లూటీ చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. వరంగల్ జిల్లా రాయపర్తిలోని SBI బ్రాంచ్‌లో 19 కేజీలకు పైగా బంగారం లూటీ చేసిన ఆ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద దొంగిలించిన బంగారంలో కొంత రికవరీ చేసిన పోలీసులు దోపిడీలకు వాడుతున్న టెక్నాలజీని చూసి షాక్ అయ్యారు. గూగుల్ మ్యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులను గుర్తించి దోచేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక …
Read More »సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
చంద్రయాన్ మంగళయాన్ తరువాత ఆదిత్య యాన్ పేరుతో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రయాణించి పరిశోధనలను మొదలుపెట్టింది. తాజాగా యూరప్‌కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబ్ 3 పేరుతో మూడు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తూ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ ప్రయోగం కోసం భారత్‌ను సాయం కోరింది. రెండు రోజుల క్రితమే ఇస్రో శ్రీహరికోట నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తలపెట్టిన ప్రోబ్ 3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం కూడా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు …
Read More »చలి తీవ్రతతో గజగజ వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. దట్టంగా కమ్మేసిన పొగమంచు!
ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో కనీష‌్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. పొగమంచు, చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందోనన్న …
Read More »Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీటి ద్వారా ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుందన్నారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన ఏడు నవోదయ విద్యాలయాలు జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో …
Read More »రాశిఫలాలు 07 డిసెంబర్ 2024:ఈరోజు ధనిష్ట నక్షత్రంలో షష్ రాజయోగం వేళ తులా సహా ఈ 5 రాశులకు ధన లాభం..!
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం, మీ కుటుంబసభ్యులతో ఏదైనా వివాహం లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అందులో మీ బంధువులలో కొందరిని కలుస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వీటిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీకు 63 శాతం వరకు …
Read More »ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.. అక్కడ మోస్తరు వర్షాలు
ఏపీకి మరో వర్ష గండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. మరి ఇంతకీ వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఇలా..భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయం బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో సుమారు డిసెంబర్ 7వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. …
Read More »అయ్యో దేవుడా.. ఆ తండ్రికి ఎందుకంత శిక్ష వేశావ్..? గుండె తరుక్కుపోయే ఘటన..
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో పుట్టెడు దుఃఖంతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని బైక్‌పై తరలించినహృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. కురుపాం మండలం నీలకంఠాపురానికి చెందిన కొండగొర్రి అశోక్, స్వాతిలకు రెండు నెల క్రితం బాబు పుట్టాడు. ఆ బాబుకి రోహిత్ అని పేరు పెట్టారు. అలా మగ బిడ్డ పుట్టాడన్నా ఆనందంలో ఉండగానే అకస్మాత్తుగా రోహిత్‌కి అనారోగ్య సమస్య తలెత్తింది. ఈ క్రమంలోనే రోహిత్ ఆరోగ్యం మరింత …
Read More »విశాఖలో యాసిడ్ దాడి అంటూ ప్రచారం.. జరిగింది ఇదేనట! కానీ ప్రశ్నలు మాత్రం ఎన్నో?
నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట.. ఇది మన పెద్దలు చెప్పేమాట. వారి కాలంలో ఏ పరిస్థితిని చూసి పెద్దలు ఈ సామెత చెప్పారో తెలియదు కానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. అసలు నిజం తెలియకముందే.. అబద్ధం ఊరంతా చుట్టి వచ్చింది. తీరా పోలీసులు అసలు వాస్తవాలు వెల్లడించిన తర్వాత.. అందరూ ఔరా అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. …
Read More »