ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు తీపికబురు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.. రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త …
Read More »Tag Archives: andhra pradesh
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. అద్భుత అవకాశం, త్వరపడండి
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను నవంబరు 7వ తేదీన టెండర్, వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్ బియ్యం 13,880 కేజీలు టెండర్, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ …
Read More »కపిల్‌దేవ్, చంద్రబాబు భేటీ.. ఏపీలో ఆ మూడు చోట్లా గోల్ఫ్ కోర్టులు!
Cricketer Kapil dev meets cm Chandrababu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. మంగళవారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కపిల్ దేవ్ …
Read More »ఏపీలో మద్యం షాపుల నడుపుతున్నవారికి షాక్.. లైసెన్సులు రద్దు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మద్యం షాపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఎమ్మార్పీపై కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా వదిలేది లేదని హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయంలో గనులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు.. ఇసుక లభ్యత, సరఫరా, మద్యం ధరలపై చర్చించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించే, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటి తప్పు కింద రూ.5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. ఒకవేళ ఆ తర్వాత కూడా మళ్లీ అవే తప్పులు …
Read More »ఏపీలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు నేను స్థలం ఇస్తా.. వృద్ధురాలి పెద్ద మనసు
ఏపీలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమైంది. అయితే నరిశెట్టి రాజమ్మ అనే వృద్ధురాలు పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రాజమ్మ.. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వరద బాధితులకు రూ.50 వేల చెక్కును అందించారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తే.. అందుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు రాజమ్మ. తమ గ్రామంలో ఇళ్లు లేని పేదలున్నారని …
Read More »అన్న క్యాంటీన్ల కోసం పెద్ద మనసుతో.. వారికి బంపరాఫర్, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించబోతున్నారు. దీని కోసం అన్న క్యాంటీన్ పేరుతో ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్ పేరుతో ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా …
Read More »ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్ …
Read More »పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే
సరస్వతి పవర్ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలోని సరస్వతి భూములలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. అటవీశాఖ దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి, ఎఫ్‌బిఓ వెంకటేశ్వరరావు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మాచవరం, చెన్నైపాలెం, వేమవరం గ్రామాల్లో జీపీఎస్ సర్వే చేశారు. అటవీ భూములు ఏమైనా సరస్వతి పవర్ భూముల్లో కలిశాయా అనే విషయమై సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను …
Read More »AP News: ఒకేరోజు ఆరు ఆలయాల దర్శనం.. స్పెషల్ టూర్ ప్యాకేజ్, ధర ఎంతంటే
ఏపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సరస్వతీ ఘాట్‌లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ముందుగా కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అన్నవరం సత్యనారాయణస్వామి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామిలను దర్శించుకుంటారు. చివర్లో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో గోదావరి …
Read More »ఏపీలో టీచర్లకు తీపికబురు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, డిసెంబర్‌లో ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతోంది. ఈ ముసాయిదా బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. టీచర్లు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీవిరమణ వరకు మారుమూల ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేలా చట్టాన్ని తీసుకొస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు ఉన్న ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. ఈ బదిలీలకు గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు కాగా.. కనీస సర్వీసు ఎంతనేది మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ముందుగా ప్రమోషన్లు ఇచ్చి, ఆ తర్వాత …
Read More »