Tag Archives: Education

మధ్యాహ్నం ఒంటిగంట.. పుస్తకాలను తలగడగా పెట్టుకుని హాయిగా బజ్జున్నారు.. కట్ చేస్తే..

రంగు రంగుల బెంచ్‌ల మధ్యలో ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్‌ల మధ్యలో పడుకున్న ఆయన తలకింద ఏకంగా పుస్తకాల కట్ట ఉంది.. ఆయన తలగడగా దానిని పెట్టుకున్నారు. పక్కనే మంచినీళ్ల బాటిల్ కూడా ఉంది. అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఒక స్కూల్లోని తరగతి గది అని అర్ధమవుతోంది.రంగు రంగుల బెంచ్‌ల మధ్యలో ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్‌ల మధ్యలో పడుకున్న ఆయన తలకింద ఏకంగా పుస్తకాల కట్ట ఉంది.. ఆయన తలగడగా దానిని పెట్టుకున్నారు. పక్కనే మంచినీళ్ల బాటిల్ కూడా ఉంది. …

Read More »

ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు ‘తెలుగు సబ్జెక్ట్‌’ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు

SSC మినహా మిగతా బోర్డులకు సంబంధించిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నిబంధనను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని, 9, 10 తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది..తెలంగాణ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్‌ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ప్రస్తుత (2024-25), వచ్చే విద్యా సంవత్సరం (2025-26) తొమ్మిదవ, పదో తరగతి చదివే విద్యార్ధులు …

Read More »

పేదరికాన్ని జయించి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గిరిజన యువతి..!

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే గగనం.. అలాంటిది గిరిజన తండాకు చెందిన ఓ యువతి, ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్ట, నష్టాలకు ఒడ్చి.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందీ గిరిజన యువతి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూల తండా నుంచి మెరిసింది ఈ గిరి పుత్రిక. ఒకే సారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఆదివాసీ ముద్దుబిడ్డ …

Read More »

సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్‌ విద్యార్ధులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇంటర్‌ బోర్డు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణ ఆదిత్య ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో …

Read More »

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తర్వాతే ఈఏపీ సెట్‌ 2025 పరీక్ష.. వెనక్కి తగ్గిన ఉన్నత విద్యామండలి?

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌ 2025) పరీక్షను ఈసారి కాస్త ముందుగానే జరపాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఈఏపీ సెట్‌ 2025 నిర్వహించనున్నట్లు గతంలో తెల్పింది కూడా. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కి తెల్పినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలలో జరగనున్న …

Read More »

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పరీక్షల టైమ్‌ టేబుల్‌ను రూపొందించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు సమాచారం. ఈ …

Read More »

స్కూల్‌ విద్యార్థులకు షాక్‌.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు? ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు షాకింగ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్‌ ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. రేపే మాపో అధికారిక టైం టేబుల్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్‌ …

Read More »

తెలంగాణలో రేపు స్కూళ్లు బంద్.. కారణం ఇదే

తెలంగాణలో సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ బాలిక మృతి చెందగా.. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఇప్పుడు స్టేట్ లెవల్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ఆందోళనల పర్వం కొనసాగుతోంది, ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల ఫుడ్ పాయిజన్ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా …

Read More »

AP Pharmacy Counselling: ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలు షురూ.. రేపట్నుంచి కౌన్సెలింగ్‌

ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది..ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్‌లో, 30 నుంచి డిసెంబరు 5 వరకు బైపీసీ స్ట్రీమ్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 వరకు, బైపీసీ విద్యార్థులకు …

Read More »

Khammam District: ఆ ప్రభుత్వ పాఠశాలలో ఒక స్టూడెంట్.. ఒక టీచర్ ..

అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆ ఖర్చు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఒక లక్ష కాదు… రెండు లక్షలు కాదు.. ఏకంగా 12.84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.. ఎలా అంటారా. .ఆ పాఠశాల ఎక్కడ ఉంది అంటారా..? ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం …

Read More »