హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …
Read More »Tag Archives: Hyderabad
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే!
తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి.. తాజాగా మరొకరు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116/- విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ మేరకు దాత విరాళం చెక్కును అందించారు. అంతేకాదు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ.4.10 లక్షల విలువైన ఎరువులను టీటీడీ ఉద్యానవన విభాగానికి విరాళంగా అందజేశారు. ఈ ఎరువులను తిరుమల, …
Read More »వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఇటీవల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి.. మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, తాజాగా వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు …
Read More »గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగీ డేంజర్ బెల్స్.. భారీగా కేసులు, ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రస్తుతం వర్షాకాలం కావటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దానికి తోడు డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగీ జ్వరాల కారణంగా చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటికే 600లకు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ పలువురు డెంగీ జ్వరాలతో జాయిన్ అవుతుండగా.. వారి …
Read More »వరుసగా పెరిగి ఒక్కసారిగా ఇలా.. లేటెస్ట్ బంగారం, వెండి ధరలివే.. తులం గోల్డ్ ఎంతంటే?
Hyderabad Gold Rates: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారత మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఎక్కువగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ సమయాల్లో కొనుగోలు చేసి ధరిస్తుంటారు. దీంతో డిమాండ్ కూడా అప్పుడు భారీగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో మాత్రం ఈ డిమాండ్‌తో పెద్దగా పని లేకుండానే ఇతర కొన్ని కారణాలతో గోల్డ్ రేట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతకుముందు …
Read More »తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్ వర్సిటీ’ శాటిలైట్ సెంటర్.. యువత భవితకు కొత్త బాటలు
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం (భారత కాలమానం ప్రకారం) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ …
Read More »పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవలి కాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెద్ద మొత్తంలో పతనమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుంటున్నాయి. కిందటి రోజు తగ్గిన రేట్లు ఇవాళ మళ్లీ ఎగబాకాయి. అయితే భారీ మొత్తంలో ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఈసారి కూడా స్థిరంగా ఉంచినప్పటికీ.. సెప్టెంబర్ మీటింగ్ సమయంలో కచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంతో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. …
Read More »హైదరాబాద్‌లో పంజా విసురుతున్న డెంగీ..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్‌లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం …
Read More »హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు..
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. …
Read More »మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వారంలో రూ.5000 డౌన్..
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5 వేలకుపైగా దిగిరావడం గమనార్హం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాతి రోజు నుంచి సైతం …
Read More »