Tag Archives: India

గృహాలకు ఉచిత విద్యుత్‌ పథకానికి విశేష స్పందన.. 1.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. మన దేశంలోని పౌరుల ఇళ్ళకు ఉచిత విద్యుత్ ను అందించేందుకు ప్రవేశ పెట్టిన పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 15, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకంతో దేశంలో కోటి ఇళ్లలో సౌర ఫలకాలను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు ప్రభుత్వం విద్యుత్ కోసం చేస్తున్న ఖర్చు ఏడాదికి సుమారు 75,000 కోట్ల రూపాయలు అదా అవుతుందని కేంద్ర మంత్రి శ్రీపాద్ …

Read More »

పీఎల్ఐ స్కీమ్ సూపర్ సక్సెస్.. ఉద్యోగాల కల్పనలో రికార్డు

భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా భారతదేశం జనాభా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంత స్థాయిలో ఉన్న జనాభాకు ఉద్యోగ కల్పనకు తయారీ రంగం కీలకం అని భావించి కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్ ద్వారా తయారీదారులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నారు. ఈ చర్యలు భారతదేశంలో ఉద్యోగ కల్పనలో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో పీఎల్ఐ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం దేశంలో ఉద్యోగ కల్పనలో నయా …

Read More »

టీమ్-11తో మంత్రివర్గాన్ని ప్రకటించిన హేమంత్ సోరెన్.. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు దక్కిందంటే..!

జార్ఖండ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. సోరెన్ కేబినెట్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా నుండి ఐదుగురు, కాంగ్రెస్ నుండి నలుగురు, RJD నుండి ఒకరు మంత్రి పదవులు పొందారు. జేఎంఎం కోటా నుంచి దీపక్ బిరువా, రాందాస్ సోరెన్, చమ్ర లిండా, యోగేంద్ర మహతో, హఫీజుల్ అన్సారీ, సుదివ్య సోను పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. కాంగ్రెస్ కోటా నుంచి ఇర్ఫాన్ అన్సారీ, దీపికా పాండే, శిల్పి నేహా టిర్కీ, రాధాకృష్ణ కిషోర్‌లకు …

Read More »

ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా పాలసీ భేష్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు..

ఇటీవల భారత ఆర్థికాభివృద్ధిని ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. తాజాగా పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం రష్యా కీలక పెట్టుబడులకు స్థిరమైన పరిస్థితులను కల్పిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. రష్యన్ ఫెడరేషన్‌లోని అన్ని రంగాలలో, హైటెక్ రంగాలతో సహా, తమ ఉత్పత్తులను విక్రయించడానికి, ఎగుమతి చేయడానికి అవకాశాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి …

Read More »

ప్రతి సంవత్సరం టిక్కెట్లపై రైల్వే ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా.. లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన

భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణికులకు మొత్తం రూ.56,993 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి టికెట్‌పై రైల్వే దాదాపు 46 శాతం రాయితీ ఇస్తోందని తెలిపారు. రైల్వే టిక్కెట్లలో తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా, అశ్విని వైష్ణవ్ సభలో మాట్లాడుతూ, భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణీకులకు మొత్తం రూ. 56,993 కోట్ల సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రతి టికెట్‌పై 46 …

Read More »

తీరనున్న సాధారణ ప్రయాణీకుల ఇక్కట్లు.. జనరల్ బోగీలను పెంచనున్న సౌత్ సెంట్రల్ రైల్వే

రైలు లో జనరల్ బోగీలో ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సిందే.. ఇంకా చెప్పాలంటే అసలు జనరల్ బోగీలోకి ఎక్కాలన్న యుద్ధం చేయాల్సిందే.. అయితే ఇక నుంచి జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణీకుల ఇబ్బందులకు చెక్ పెట్టనున్నారు. అవును ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు అంటోంది సౌత్ సెంట్రల్ రైల్వే..ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రెండే జనరల్ కోచ్ లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. …

Read More »

పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ??

అంతేకాకుండా టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా మూత్రవిసర్జన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ ఇవ్వకపోవడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పిల్లల నిద్రపై టీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం వంటి సమస్యలు వస్తాయి. సరిగా నిద్రపోయే పిల్లల్లోనే శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల వారి నిద్రపై ప్రభావం పడి వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చిన్న …

Read More »

గోర్లు, చర్మంలో ఈ 5 మార్పులు గుండె జబ్బులకు సంకేతాలు.. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..

ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు వేగంగా పెరగుతున్నాయి.. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అటువంటి పరిస్థితిలో గుండెపోటు ను నివారించడానికి,  గుండె జబ్బుల దుష్ప్రభావాలను నివారించడానికి ముందుగా వాటి సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.. దీని ద్వారా సకాలంలో చికిత్సను పొందడంతోపాటు ప్రాణాలను కాపాడుకోవచ్చు.. అయితే, గుండెలో అవాంతరాలను గుర్తించడానికి మేము మీకు కొన్ని సంకేతాలను చెప్పబోతున్నాం.. వీటిని …

Read More »

మరో సంచలనానికి సిద్ధమవుతున్న ముఖేష్ అంబానీ.. కేవలం రూ.14,999 జియో ఎలక్ట్రిక్ స్కూటర్..!

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేయడం ప్రారంభించాయి. పర్యావరణ హితం పట్ల అవగాహన పెగుతుండటంతో EVల రికార్డు అమ్మకాలు పెరగుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్, లేదా ఎలక్ట్రిక్ కార్ లేదా త్రీవీలర్ లేదా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు, ప్రజలు బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ 2027 నాటికి 35-40 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. 2025 నాటికి భారతదేశంలో EV విక్రయాల వాల్యూమ్‌లు 3-4 మిలియన్ …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి

కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం వెల్లడించారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి వాటివల్ల ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. అక్టోబర్‌ 30 నాటికి …

Read More »