Tag Archives: Kerala

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెలుగు సహా ఆరు భాషల్లో చాట్‌బాట్

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం (నవంబరు 15) నుంచి మండల మకరు విళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పూర్తిచేశాయి. తాజాగా, శబరిమల యాత్రికులకు సేవల కోసం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ సర్కారు. దీనికి సంబంధించిన ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం ఆవిష్కరించారు. ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఈ చాట్‌బాట్ రూపొందించారు. స్మార్ట్‌ ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా ఆంగ్లం, …

Read More »

AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …

Read More »

హిమాచల్‌ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. 20 మంది గల్లంతు.. భయానక దృశ్యాలు

కేరళలో ప్రకృతి ప్రకోపం మరిచిపోకముందే హిమాచల్ ప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. సిమ్లా సమీపంలోని రామ్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్‌ అయినట్టు కుండపోత వర్షం కురవడంతో 20 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అయినట్టు విపత్తు నిర్వహణ దళానికి సమాచారం వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. తక్షణమే అక్కడకు విపత్తు నిర్వహణ బృందం, డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్, ఎస్పీ సంజీవ్ గాంధీ సహా ఇతర ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లారని వెల్లడించారు. క్లౌడ్ …

Read More »

161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …

Read More »

తుడిచిపెట్టుకుపోయిన 4 గ్రామాలు.. వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. ఆ 250 మంది సంగతేంటో?

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలియక చాలా మంది దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్న వారు కూడా తమను కాపాడాలంటూ ఫోన్లు చేస్తుండటం గమనార్హం. సహాయక సిబ్బందికి తోడు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగడంతో.. వయనాడ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …

Read More »

కేరళ ప్రకృతి విలయంలో 43 మంది సమాధి.. 

మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సం ఇప్పటివరకు 43 మందిని పొట్టనబెట్టుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. …

Read More »

కోట్లలో చీట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలు.. ఈడీ దర్యాప్తు..

సినిమా: మాలీవుడ్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. ఏకంగా రూ. 220 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాను సౌభిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. అయితే ఫిల్మ్ ఇన్వెస్టర్ సిరాజ్ వలియతర హమీద్ తనను నిర్మాతలు చీట్ చేశారని కేసు పెట్టడంతో మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తను ఈ ప్రాజెక్ట్ పై ఇన్వెస్ట్ చేసినప్పుడు.. లాభాల్లో నలభై శాతం వాటా ఇస్తామని ఒప్పుకున్నారని, …

Read More »