Tag Archives: Nellore

కమిషనర్ వద్దకు వచ్చిన బిక్షాటన చేసే బాలురు – ఏం అడిగారో తెలిస్తే మీ మనసు చివుక్కుమంటుంది

సారూ మాకు చదువు చెబుతారా! అంటూ భిక్షాటన చేసుకునే ఇద్దరు బాలురు కమిషనర్​‌ను వేడుకున్న దృశ్యం అందర్నీ చలించేలా చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ ‘మీకు తెలిసిన పెద్దవారిని తీసుకొచ్చి, పాఠశాలలో చేరండి’ అంటూ తన ఫోన్‌ నంబరును వారికి ఇచ్చి పంపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ వైవో నందన్‌ గురువారం వీఆర్‌ విద్యాసంస్థల ప్రాంగణాన్ని సందర్శించగా ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన బిక్షాటన చేసే అనాథ బాలురు పెంచలయ్య, వెంకటేశ్వర్లు “సార్‌ మాకూ చదువు చెబుతారా?” అంటూ …

Read More »

చిన్నారి ప్రాణం తీసిన మూఢనమ్మకం.. నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు చేస్తే బతుకుతుందనే ఆశతో చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చిలో భవ్యశ్రీతో ప్రార్థనలు చేయిస్తూ వచ్చారు. సుమారు 40 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే భవ్యశ్రీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి కన్నుమూసింది. దీంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని.. ఆస్పత్రికి వెళ్లకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. …

Read More »

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి దిగుమతి అయిన వెల్లుల్లిని అక్రమంగా తరలిస్తుండగా.. పట్టుకున్నారు. అయితే ఈ చైనా వెల్లుల్లిని కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే నిషేధించడం గమనార్హం. చైనాలో వెల్లుల్లిని అపరిశుభ్రమైన వాతావరణంలో పండిస్తారని.. దాన్ని తినడం వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం అని ఇప్పటికే ఎంతో మంది తేల్చారు. అయినా ఇప్పటికీ దేశంలోకి చైనా వెల్లుల్లి అక్రమంగా వస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. చైనా నుంచి …

Read More »

నెల్లూరు: ఈ మహిళ ఎంతో లక్కీ.. బంగారం మొత్తం, ఆర్టీసీ బస్సులో ఆసక్తికర ఘటన

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును జాగ్రత్తగా తిరిగి అప్పగించారు. ఆదివారం రోజు అల్లూరులో శ్రీహరికోట కుమారి ఆర్టీసీ బస్సు ఎక్కారు.. అయితే తన స్టాప్‌లో బస్సు దిగిపోయే సమయంలో ఆమె తన పర్సును సీట్‌లో మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆర్టీసీ బస్ కండక్టర్ వెంకయ్య పర్సును గమనించారు.. తీసి చూడగానే బంగారం, డబ్బులు కనిపించాయి. వెంటనే ఈ సమాచారాన్ని డిపో మేనేజర్‌కు అందించారు. ఆ మహిళ పర్సును తీసుకెళ్లి జాగ్రత్తగా డిపోలో …

Read More »

నెల్లూరులో గోల్డెన్‌మెన్ సందడి.. ఒంటి నిండా బంగారమే, ఎన్ని కేజీలో తెలిస్తే!

నెల్లూరులో గోల్డ్‌మెన్ సందడి చేశారు.. ఒంటి నిండా బంగారంతో నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. కర్ణాటకకు చెందిన గోల్డ్‌మెన్‌ రిజమూన్‌ నెల్లూరు వచ్చారు. ఆయన ఒంటిపై ఏకంగా 2 కిలోలకుపైగా బంగారంతో కనిపించారు. రిజమూన్‌ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో 31 ఏళ్లుగా స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ 30 ఎకరాల కాఫీ ఎస్టేట్‌ ఉంది.. రెడ్‌లన్స్‌ కంపెనీ రీజినల్‌ మేనేజర్‌గా ఆరు రాష్ట్రాలు చూస్తున్నారు. తనకు ఐదు భాషలు వచ్చని.. తెలుగు కూడా త్వరలో నేర్చుకుంటానని చెబుతున్నారు రిజమూన్. సింగర్‌ …

Read More »

విజయవంతంగా నింగిలోకి చేరిన ఈవోఎస్-8.. ఇస్రో ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-8 (EOS-08)ను చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 శుక్రవారం ఉదయం ప్రయోగించారు. ఆరున్నర గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న …

Read More »