Tag Archives: Rains

ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి అంటున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ అల్లూరి …

Read More »

విజయవాడ వరదలో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు నష్టపోయారా.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు అపార నష్టాన్న మిగిల్చాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వరద దెబ్బకు ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు, ఈ వరదల్లో ముఖ్యంగా ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. …

Read More »

రాగాల మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు… ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే …

Read More »

ఏపీకి బంగాళాఖాతంలో మరో ముప్పు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు ముంచుకొస్తోంది.. ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9వ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా …

Read More »

బుధవారం కూడా అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవు.. ఈ జిల్లాలో మాత్రమే..

School Holiday : మంగళవారం కూడా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉందా? లేదా? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంకా వర్ష బీభత్సం కనిపిస్తోంది. వాగులు వంకలు వరదతో పోటేత్తాయి. వర్షపు నీళ్లు ప్రవాహంలా మారి రోడ్లపైకి వచ్చేశాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. వాహనాలు ముగినిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా …

Read More »

రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ కోటి.. ఏపీకి అశ్వనీదత్, ఆయ్ టీం విరాళం

రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీటమునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరవయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. రెండు తెలుగు …

Read More »

ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. తుఫాన్ తప్పదా?.. ఈ జిల్లాలపై ప్రభావం!

ఆంధ్రప్రదేశ్‌కు వాయుగండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంతలో మరో ముప్పు ఏపీని వెంటాడుతోంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లిగా బలపడి తుఫాన్‌గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా …

Read More »

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు సాయం.. అశ్వినీదత్ భారీగా, ఎంత ప్రకటించారంటే!

తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి వివరించారు.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా తన వంతు సాయంగా వ్యక్తిగత పింఛన్‌ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు హర్షవర్దన్‌ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున, కుమార్తె …

Read More »

ఏపీకి కొత్త టెన్షన్.. మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!

ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల వర్షానికే జనజీవనం స్తంభించింది. వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అది తుఫాన్‌గా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పక్కాగా క్లారిటీ వస్తుంది అంటున్నారు. వాయుగుండం నుంచి తేరుకోక ముందే మళ్లీ తుఫాన్ టెన్షన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాలు అతి భారీ …

Read More »

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రసుత్తం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ (మహారాష్ట్ర) వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం …

Read More »