తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా వచ్చే నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్టులను ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …
Read More »Tag Archives: Rains
నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వానపడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబ్దుల్లాపూర్‌మేట్, జీడిమెట్ల, సూరారం, అబిడ్స్, నాంపల్లి, నాగోల్, అంబర్ పేట్, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, షేక్ పేట, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ …
Read More »హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం, జాగ్రత్తగా ఉండండి
హైదరాబాద్ నగరవాసులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత, లేదా రాత్రికి నగరంలో భారీ వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం వరకు వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా క్యుములోనింబస్ తుఫానులు వస్తాయని హెచ్చరిచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణలోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, …
Read More »హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …
Read More »హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు …
Read More »బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల 6 వరకు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు …
Read More »గంటలోనే 13 సెం.మీ. వర్షం.. రెడ్ అలర్ట్ జారీ..
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురిసిన వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక, దేశ రాజధాని నగరం ఢిల్లీని బుధవారం సాయంత్రం వరుణుడు వణికించాడు. కేవలం గంటలోనే దాదాపు 13 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గురువారం కూడా అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్న భారత వాతావరణ విభాగం.. రెడ్ అలర్ట్ జారీచేసింది. ఇక, బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ …
Read More »161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు
ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …
Read More »తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో రెండ్రోజుల పాటు వానలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలంగాణలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించటం లేదు. తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. రాజన్న సిరిసిల్ల, వరంగల్, …
Read More »విద్యార్థులను భుజాన ఎక్కించుకుని వరద ప్రవాహాన్ని దాటించిన మాస్టారు
ఉపాధ్యాయుడంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించటమే కాదు.. విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి.. మంచి మార్గాన్ని చూపించటం కూడా. అవసరమైతే.. చేయి పట్టుకుని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమతమ జీవితాల్లో గమ్యాలను చేర్పించటం ప్రస్తుత కాలంతో కొంచెం కష్టమైన విషయమే కానీ.. అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి.. మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు. కుమురం భీం …
Read More »