భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో మొత్తం నీటమునిగి అస్తవ్యస్తం అయ్యాయి. ఇక ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న జనం.. తిండి, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి.. వరద బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫార్మా కంపెనీ అయిన దివీస్ ల్యాబ్స్ కూడా రంగంలోకి దిగింది. భారీ వరదలతో అతలాకుతలం అయిన బెజవాడ నగరానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే విజయవాడ …
Read More »Tag Archives: Vijayawada
భారీ వర్షాల వేళ విజయవాడకు అమావాస్య గండం.. బిక్కుబిక్కుమంటున్న జనం
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలను వణికిస్తున్నాయి. గత 2, 3 రోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతులో వరదనీరు చేరింది. సహాయం కోసం వరద బాధితులు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో.. …
Read More »వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం సరఫరా.. పరిశీలించిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదలు పోటెత్తడంతో ఎక్కడి జనం అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో.. సామాన్లు మొత్తం నీళ్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే జనం అంతా ఇళ్లపైకి ఎక్కి.. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేయడమే కాకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే హెలికాప్టర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండకపోవడంతో టెక్నాలజీని వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డ్రోన్ల ద్వారా …
Read More »తెలుగు ప్రజలకు అలర్ట్.. భారీగా రైళ్లు రద్దు చేశారు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్స్ దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని …
Read More »విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. అత్యవసరమైతే ఈ రూట్‌లో వెళ్లండి
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ప్రజల భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి …
Read More »విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ మూడు రోజులు ఈ సమయంలో దర్శనాలు నిలిపివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు కీలకమైన సూచన చేశారు. దుర్గమ్మకు నివేదన సమర్పించే సమయంలో.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. అందుకే ఆ సమయంలో ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. అంతేకాదు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఇతర రోజుల కంటే ఎక్కువగా ఉంటోంది. ఉదయం 11.30 నుంచి …
Read More »విజయవాడలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ కృష్ణమ్మకు హారతి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న సమయంలోని కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయాయి.. అయితే వాటిని తిరిగి ప్రారంభిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెర్రీ దగ్గర మళ్లీ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని నెల రోజుల్లోగా తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు …
Read More »విజయవాడ దుర్గమ్మ హుండీకి కాసుల వర్షం.. 18 రోజుల్లో రూ.కోట్లలో ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు దుర్గామల్లేశ్వర దేవస్థానంలో హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయంలోని మహామండపం 6వ అంతస్తులో ఈవో ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 18 రోజులకుగాను అమ్మవారికి కానుకల రూపంలో రూ.2,97,47,668 నగదు సమకూరింది. అంటే రోజుకు సగటున రూ.16,62,648 చొప్పున నగదు రూపంలో కానుకలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 410 గ్రాములు, వెండి 5 కిలోల 280 గ్రాములు భక్తులు హుండీల ద్వారా అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మ హుండీలలో విదేశీ కరెన్సీ కూడా …
Read More »విజయవాడ దుర్గమ్మ భక్తులకు అదిరే ఆఫర్.. ఉచితంగానే, వెంటనే దరఖాస్తు చేస్కోండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో రామరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తుమన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్‌కు 500 మందికి మాత్రమే అనుమతి …
Read More »నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. …
Read More »