YS Sharmila: వైఎస్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు.. బయటికి రావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే వివాదమే తమ ఇంట్లో ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన షర్మిల.. ప్రతీ ఇంట్లో తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది సామాన్యమైన విషయం కాదు …
Read More »Tag Archives: ys jagan
జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైరయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అన్న మీద బాణాలు వదులుతున్న వైఎస్ షర్మిల.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వైసీపీపైనా అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పాలనతో పాటుగా గత వైసీపీ పాలనను కూడా షర్మిల ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై షర్మిల.. ప్రస్తుత, గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ మానసపుత్రిక అయిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం.. …
Read More »నేను ఆ మాట చెబితే పార్టీలో ఎవరికీ నచ్చకపోవచ్చు.. నా వల్ల మాత్రం కాదు: జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలు అనేంత దారుణమైన పాలనను చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. రెడ్‌బుక్ పాలన నడుస్తోందన్నారు. సూపర్-6 పథకాలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే బడ్జెట్ పెట్టకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఓటాన్ అకౌంట్‌తో నడిపిస్తున్నారని.. చంద్రబాబు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సదస్సులో …
Read More »తిరుమల డిక్లరేషన్ వివాదం.. నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి …
Read More »పిలిచి సీటిచ్చిన వైఎస్ జగన్‌కు షాకిచ్చిన కృష్ణయ్య.. అసలు కారణాలు ఇవేనట..
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామా చేసిన కృష్ణయ్య లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు. మరోవైపు ఆర్. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ …
Read More »జగన్‌కు తలనొప్పిలా మారిన మంత్రి నారాయణ పెట్టిన కేసు.. మరోసారి హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా.. రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని అప్పటి మంత్రి నారాయణ.. 2018లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు …
Read More »వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పిన్నెల్లికి మరోసారి ఆ బాధ్యతలు, వరుసగా రెండోసారి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్. ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. జిల్లాలవారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అధినేత జగన్ కీలక బాధత్యలు అప్పగించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. అంతకముందు కూడా పిన్నెల్లి ఆ బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్ మళ్లీ నియమించారు. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు, …
Read More »వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ.. ఏపీ హైకోర్టు సీరియస్, ఆ పదజాలంపై అభ్యంతరం
మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు భద్రత పెంచాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్‌లో జగన్‌కు మద్దుతగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి ఇంప్లీడ్ పిటిషన్ వేయడంపై సీరియస్‌గా స్పందించింది. జగన్ ఓవైపు తన భద్రత గురించి పిటిషన్ వేశాక.. మూడో పక్షం ఇంప్లీడ్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొందరు కోర్టుల్నిప్రచార వేదికలు, క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారని ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఖాజావలి ఇంప్లీడ్ పిటిషన్లో …
Read More »వైఎస్ జగన్‌తో సెల్ఫీ.. మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు చిక్కులు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన …
Read More »జగన్ లండన్ ప్రయాణం వాయిదా.. ఆ పాస్‌పోర్ట్ రద్దు చేయడంతో, ఏమైందంటే!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఆయనకు పాస్‌పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి.. మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ రద్దుయ్యింది.. దీంతో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి.. ఏడాదికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఐదేళ్ల పాటూ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal