దుబాయే కాదు భారత్‌లోనూ టాక్స్ ఫ్రీ స్టేట్.. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా.. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. స్టాండర్డ్ డిడక్షన్ పెంచి.. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్లోనూ మార్పులు చేసింది. ఇక దేశంలో ఒక పరిమితి దాటి సంపాదించే డబ్బుపై.. ప్రభుత్వానికి ఇన్‌కంటాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో.. ఎంత ఆదాయానికి ఎంత పన్ను అని టాక్స్ శ్లాబులు ఉంటాయి. ఆ రేట్లను బట్టి పన్ను చెల్లించాలి. ఎంత ఎక్కువ సంపాదిస్తే కట్టాల్సిన టాక్స్ అలా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే రిచ్ సిటీల్లో ముందువరుసలో ఉండే దుబాయ్‌లో టాక్స్ ఉండదన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే భారత్‌లోనూ ఒక రాష్ట్రంలో ఇలాగే పన్ను చెల్లించాల్సిన పని లేదు.

కొన్నాళ్లుగా సిక్కిం రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ చెల్లించట్లేదు. వీరికి పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది. దేశంలోని అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయాల్లో పర్వత శ్రేణుల్లో ఈ ప్రాంతం.. భారత్‌లో 22వ రాష్ట్రంగా విలీనం అయింది. అప్పుడు 1975లో ఒక రెఫరెండం నిర్వహించి మరీ సిక్కింను దేశంలో విలీనం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న రాజు.. సిక్కింను దేశంలో విలీనం చేసేందుకు ఒక షరతు విధించారు.

1975కు ముందు అయితే తాము పన్ను చెల్లింపుల్లో ఎలాంటి చట్టాలు, నిబంధనలు పాటిస్తున్నామో.. విలీనం తర్వాత కూడా అవే ఉండాలని సూచించారు. అంటే ఈ లెక్కన భారత్‌లో విలీనమైనప్పటికీ సిక్కింకు ప్రత్యేక హోదా కొనసాగించాలని కోరారు. 1975 కు ముందు నుంచే సిక్కిం తన సొంత పన్ను చట్టం- 1948 అనుసరిస్తూ వస్తోంది. దీంతో సిక్కింలో ఉంటున్న వారు కేంద్రానికి ఎలాంటి పన్ను చెల్లించట్లేదు.

>> ఇక 2008లో కేంద్రం.. సిక్కింలో ఉన్న ఇన్‌కంటాక్స్ చట్టాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో ఆర్టికల్ 371 (F) ను విధించింది. టాక్స్ పేమెంట్స్ కోసం కొత్తగా సెక్షన్ 10 (26AAA) తీసుకొచ్చింది. దీని ప్రకారమే.. సిక్కింలో ఉంటున్న 94 శాతం జనం.. పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు పొందుతారన్నమాట. 2008 బడ్జెట్ సమయంలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సెక్షన్ (26AAA) ప్రకారం.. ఇతర ప్రాంతాల నుంచి స్వీకరించే సెక్యూరిటీలు, డివిడెండ్లపై కూడా వడ్డీల వంటి విషయంలో సిక్కిం జనం టాక్స్ బెనిఫిట్ పొందుతారు.

About amaravatinews

Check Also

అదంతా మోదీ క్రెడిటే.. భారత ప్రధానిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో.. భారతదేశం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణలతో సహా అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *