రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2.74లక్షల మంది రైతులకు బీమా..!

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈనెల 15 నుంచే 2024-25 రైతు బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. కాగా, 18-59 ఏళ్ల వయసున్న వారు ఈ స్కీమ్‌కు అర్హులు. దీంతో 60 ఏళ్లు నిండిన వారిని పథకం నుంచి తొలగించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను రేవంత్ సర్కార్ రెన్యువల్ చేయనుంది. ఈ నెల 5తో రైతు బీమా దరఖాస్తుకు గడువు ముగియగా.. కొత్తగా 2.74లక్షల మంది అర్హులను ప్రభుత్వం గుర్తించింది. వీరితో కలిపి మొత్తం 47.87లక్షల మంది రైతులకు రైతు బీమా పథకం వర్తించనుంది.

ఆగస్టు 13న మూడో విడత రైతు రుణమాఫీ
ఇక రైతు రుణమాఫీపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల హామీలో కాంగ్రెస్ పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల 18న తొలి వడతలో దాదాపు 11 లక్షల మందికి రూ. లక్షలోపు రుణాలు, ఆ తర్వాత జూన్ 31న రెండో విడతలో దాదాపు 6.40 లక్షల మంది రైతులకు రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేశారు. రెండు విడతల్లో కలిపి మెుత్తంగా 17.75 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో రూ.12,224 కోట్లు జమ చేశారు.

ఇక ఈనెల 15న మూడో విడత రుణమాఫీ చేయనున్నారు. రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్య రుణాలు ఉన్న రైతులకు మాఫీ వర్తించనుంది. ఖమ్మంలో మూడో విడత నిధులను సీఎం విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఇది వరకే ప్రకటించారు. మూడో విడత రుణమాఫీ రూ. 20 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

About amaravatinews

Check Also

హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాల రద్దు.. కారణం అదేనా?

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై కఠిన చర్యలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *