వికారాబాద్ జిల్లా లగచర్లలో ఈనెల 11న ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా.. హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. పట్నం వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో అందరు ఖైదీలతో ఉంచకుండా స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం అనుమతించాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించినట్లయింది.
Check Also
తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!
దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో …