తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మెషిన్‌ను సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వొచ్చు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో రాజేంద్ర, సౌత్ ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ టీఎం మోహన్, ఏజీఎం మధు, చీఫ్ మేనేజర్ వెంకట్రావు, తిరుపతి బ్రాంచ్ హెడ్ అశోక్ వర్ధన్ పాల్గొన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal