తిరుమలలో 300 ఏళ్లుగా కొనసాగుతున్న వేడుక.. ఈ సారి జులై 24న..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో పల్లవోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 24వ తేదీన తిరుమలలో పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది .మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జులై 24న పల్లవోత్సవం నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవోత్సవం సందర్భంగా సహస్రదీపాలంకార సేవ తర్వాత.. శ్రీవారు కర్ణాటక సత్రానికి చేరుకుంటారు. శ్రీదేవీ, భూదేవీసమేతుడైన శ్రీనివాసుడు కర్ణాటక సత్రానికి చేరుకున్న తర్వాత.. కర్ణాటక ప్రభుత్వం తరుఫున వచ్చిన ప్రతినిధులు.. మైసూరు సంస్థానం ప్రతినిధులు.. స్వామివారికి హారతి సమర్పిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి.. నైవేద్యం సమర్పిసారు. పూజలు ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారుగా 300 సంవత్సరాల నుంచి పల్లవోత్సవం జరుగుతోంది. శ్రీవారి భక్తుడైన మైసూరు మహారాజు అప్పట్లో స్వామివారికి భారీ విరాళాలు అందించారు. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మాత్సవాల సందర్భంగా ఉపయోగించే గరుడ వాహనం, గజ వాహనం, ముత్యపుపందిరి, సర్వభూపాల, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలను వేంకటేశ్వరుడికి సమర్పించుకున్నారు. అలాగే శ్రీవారి పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీ కూడా మైసూరు మహారాజు అందించిందే. అలాగే ప్రతి రోజూ వేకువజామున శ్రీవారి సుప్రభాతసేవ సమయంలో మైసూరు సంస్థానం తరుఫున నవనీత హారతి సమర్పిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజదీపానికి ప్రతి రోజూ మైసూరు సంస్థానం తరుఫున ఐదుకేజీల నెయ్యి ఇవ్వడం సాంప్రదాయం. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

About amaravatinews

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *